గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న శృతిహాసన్ మళ్లీ విజృంభించేందుకు రెడీ అవుతున్న నేపధ్యంలో ఆమె వరసపెట్టి సినిమాలు ఒప్పుకుంటోంది. ఇలాంటి పరిస్థితులలో ఆమె లేటెస్ట్ గా  ముంబైలో రానా దగ్గుబాటి రాఘవేంద్రరావు తనయుడు దర్శకుడు ప్రకాశ్ కొవెలమూడి లతో కలిసి హంగామా చేసిన ఫొటోలు మీడియాకు లీక్ అయ్యాయి.  

హాలీవుడ్‌లో శృ‌తి హాసన్ ఒక  అమెరికన్ సిరీస్‌ కు ఓకె చెప్పపడమే కాకుండా   ప్రస్తుతం ఆమె  రానా ప్రకాశ్‌ లతో సమావేశం కావడంవెనుక ఏదో ఒక కారణం ఉంది అంటూ వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ముంబైలో ఉంటున్న శృతిహాసన్‌ ను కలుసుకోవడానికి రానా ప్రకాశ్ కోవెలమూడిలు కలిసి వెళ్ళడమే కాకుండా   అక్కడ వీరంతా ఒక ప్రాజెక్ట్ గురించి చర్చించి నట్లు వార్తలు వస్తున్నాయి.  

అయితే ఆ ప్రాజెక్ట్‌ కు సంబంధించిన వివరాలు మాత్రం గోప్యంగా ఉంచుతున్నారు. బ్రిటన్‌ లోని రాక్ బ్యాండ్ సభ్యుడైన మైఖేల్ కోర్సలేతో కొంత కాలం డేటింగ్ చేసిన శృతి  ఆతరువాత అతడితో  అనూహ్యంగా బ్రేకప్ చెప్పింది. అయితే తరువాత ఒక్క క్షణం కూడ ఖాళీ లేకుండా శృతి అటు మ్యూజిక్ ఇటు సినిమా అవకాశాలపై దృష్టి పెట్టదమే కాకుండా  ఇటీవల లండన్‌ లో మ్యూజిక్ బ్యాండ్‌ కార్యక్రమంలో శృతిహాసన్ పాల్గొని అక్కడ పాటలు కుడా పాడింది.   

ప్రస్తుతం ఈమె  విజయ్ సేతుపతితో ఒక తమిళ సినిమా చేస్తున్న ఈమె త్వరలో ప్రారంభం కాబోతున్న చిరంజీవి కొరటాల మూవీ ప్రాజెక్ట్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కుడా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లకు తోడు ఈమె రానాతో జత కట్టి చేయబోతున్న ప్రాజెక్ట్ ఎంటి అన్న విషయ మై ఇండస్ట్రీ వర్గాలు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: