టాలివుడ్ సూపర్ స్టార్ మహేశ్ గురించి తెలీని వారు ఎవరుంటారు. ఎంతో మంది అభిమానులు ఉన్నారు. మహేశ్ అందానికి వీరాభిమానులు ఉన్నారు. చాక్లెట్ బాయ్, చబ్బీ బాయ్, మిల్కీ బాయ్.. అని ఆయన్ను అమ్మాయిలతో పాటు హీరోలు కూడా పిలుస్తూంటారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ ఫేమస్ హీరోల్లో ఒకరైన మహేశ్ తెలేదంటే వినడానికే ఆశ్చర్యంగా ఉంది. అలాంటిది.. ఒకప్పటి మోడల్, 1997 పరదేశ్ సినిమాతో బాలీవుడ్ లో పరిచయమైన నటి మహిమా చౌదరికి మాత్రం.. మన ప్రిన్స్ మహేశ్ బాబు తెలియదంట.

 

ఇటివల హైదరాబాద్ వచ్చిన మహిమ ఓ చానెల్ కు ఇంటర్వూ ఇస్తూ కొన్ని ఆశ్చర్యపరిచే స్టేట్ మెంట్లు ఇచ్చింది. తనకు టాలివుడ్ లో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, నాగార్జున మాత్రమే తెలుసని.. నమ్రత కూడా తెలుసని మహేశ్ బాబు ఎవరో తెలీదని చివరగా ఓ మాట అనేసింది. అసలు ట్విస్ట్ అంతా ఇక్కడే ఉంది. టాలివుడ్ స్టార్లు తెలిసినప్పడు ఈ సూపర్ స్టార్ కూడా తెలియాలి కదా. అందులోనూ నమ్రత తెలుసంటే.. మహేశ్ తెలీకుండా ఎలా ఉంటాడు.

 

దీంతో ఆమె మాటలకు అభిమానులు మండిపడుతున్నారు. మహేశ్ తెలీదంటే తమ హీరోను అవమానించటమేనని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఫ్యాన్స్ ఆమెపై కోపం వ్యక్తం చేస్తూ.. ఇకనైనా మహేశ్ అంటే ఎవరో తెలుసుకో.. లేదంటే నమ్రత నైనా అడిగి తెలుసుకో అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఈ విషయంలో మహిమ వ్యాఖ్యలకు నమ్రత రియాక్షన్ ఎలా ఉంటుందో తెలీదు. స్వతహాగా అన్నింటినీ లైట్ తీసుకునే మహేశ్ ఫ్యామిలీ ఈ అమ్మడు విషయంలో కూడా.. ఈవిడకు మహేశ్ తెలీకపోతే వచ్చే నష్టం ఏమీ లేదు అని ఊరుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: