సామాజిక ప్రయోజనంతో కూడిన ప్రేమకథా చిత్రానికి ప్రస్తుతం దర్శకత్వం వహిస్తున్నాను. చదలవాడ శ్రీనివాసరావు నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమా పతాక ఘట్టాలు మినహా చిత్రీకరణ పూర్తి చేసుకున్నది. ఆదిలాబాద్ అడవులు, కుంటాల జలపాతంతో పాటు కశ్మీర్‌లో ప్రధాన ఘట్టాలను తెరకెక్కించాం . సమాజంపై ప్రేమ ప్రభావాన్ని ఆవిష్కరిస్తూ రూపొందుతున్న ఈ చిత్రంతో నూతన తారల్ని తెలుగు చిత్రసీమకు పరిచయం చేస్తున్నాం.

 

ఒకప్పుడు తెలంగాణ కథాంశాల పట్ల చిత్రసీమ విముఖత చూపించింది. ప్రస్తుతం తెలంగాణ నేపథ్యాలే సినిమాల విజయాల్లో కీలకభూమిక పోషిస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను ఇతివృత్తంగా చేసుకుంటూ సినిమాలు రావాలని కోరుకుంటున్నాను. కాళేశ్వరం కల నెరవేరినట్లుగానే తెలంగాణలో తెలుగు సినిమా అభివృద్ధి సాకారం అవుతుందనే నమ్మకం ఉంది.

 

దర్శకనిర్మాత, ఉద్యమకారుడు ఎన్.శంకర్‌కు ఐదెకరాల స్థలాన్ని కేటాయించి ఆ దిశగా ప్రభుత్వం ముందడుగు వేయడం ఆనందంగా ఉంది. భవిష్యత్తులో ప్రభుత్వం నుంచి తెలంగాణ సినీకళాకారులకు మరింత ప్రోత్సాహం లభిస్తుందనే నమ్మకం ఉంది. యువతరం దర్శకులతో పోటీపడి సినిమాలు చేయాలనే తపన పెరిగింది. సినిమాలు తప్ప నాకు మరో ప్రత్యామ్నాయం లేదు.

 

తెలంగాణ వ్యవసాయశాఖతో పాటు ఇష్ట అనే అంతర్జాతీయ కాన్ఫరెన్స్ కోసం చేసిన లఘు చిత్రాలు నాకు మంచి పేరుతెచ్చిపెట్టాయి. నేను రూపొందించిన డూ డూ డీ డీ బాలల చిత్రానికి పశ్చిమబెంగాల్ ప్రభుత్వం నుంచి అవార్డు అందుకున్నాను. చారిత్రక కథాంశంతో ఓ వెబ్‌సిరీస్‌ను భారీ నిర్మాణ విలువలతో రూపొందించే ఆలోచనలో ఉన్నాను. అని పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: