మొదట సినిమాల్లో నటించి ఆ తర్వాత బుల్లితెరకు షిఫ్ట్ అయిన అందాల భామ రష్మి గౌతం జబర్దస్త్ షోలో అనసూయ ఇచ్చిన ఇచ్చిన గ్యాప్ ను ఫుల్ ఫిల్ చేసి ఆ తర్వత ఆమె స్థానానికే ఎసరు పెట్టింది. జబర్దస్త్ రష్మి యాంకరింగ్ చూసి సూపర్ అనేయగా రష్మి కోసం జబర్దస్త్ ను రెండుగా చేసి ఎక్స్ ట్రా జబర్దస్త్ కు రష్మికి ఛాన్స్ ఇచ్చారు.   


అనసూయ లానే కేవలం యాంకరింగ్ మాత్రమే కాదు తన అందాలతో అలరిస్తుంది రష్మి గౌతం. ఇక బుల్లితెర మీద వచ్చిన ఈ క్రేజ్ తో గుంటూర్ టాకీస్ సినిమాతో దుమ్ముదులిపేసింది. ఆ సినిమాలో అమ్మడి హాట్ షోకి కుర్రాళ్లు పిచ్చెక్కిపోయారు. ఆ సినిమా హిట్ అవడంతో రష్మికి వరుసగా అలాంటి ఛాన్సులే వస్తున్నాయి.


ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే ముక్కుసూటి మనిషి రష్మి అందుకే డబ్బు కోసం నేను అలాంటి పాత్రలు చేస్తున్నా అంటుంది. అయితే తన దగ్గరకు వచ్చే దర్శక నిర్మాతలు అలాంటి సినిమాలే చేయాలని అంటున్నారు. ఏ ఒక్క దర్శకుడు తనలోని నటిని గుర్తించే ప్రయత్నం చేయట్లేదని అంటుంది రష్మి. తనకు మంచి పాత్రలు చేయాలని ఉందని కాకపోతే తనకు రొటీన్ ఛాన్సులే వస్తున్నాయని అంటుంది.    


డబ్బులిస్తే ఎలాంటి పాత్రకైనా సరే అంటున్న రష్మి ఛాన్స్ వస్తే మాత్రం తన సత్తా చాటుతా అంటుంది. మరి రష్మిలోని టాలెంట్ ను గుర్తించి ఆ ఛాన్స్ ఇచ్చే దర్శకుడు ఎవరో చూడాలి. బుల్లితెర మీద రష్మి చేసే హంగామా తెలిసిందే.. సిల్వర్ స్క్రీన్ పై కేవలం హాట్ ఇమేజ్ తో నెట్టుకొస్తున్న రష్మి మంచి సినిమాలు చేయాలని ఆశిద్దాం.



మరింత సమాచారం తెలుసుకోండి: