సినీ నటి ఆర్తి చాబ్రియా వివాహం తనకు నచ్చిన ప్రియుడి విశరధ్ బీడసీ తో జరిగింది.  వీరిద్దరూ గత కొంత కాలంగా ఒకరినొకరు ఇష్టపడి ప్రేమించు కుంటున్నారు.  కాకపోతే  ఈ పెళ్లి విషయం మీడియాకు పొక్కకుండా గోప్యత పాటించడం గమనార్హం. ముంబైలో సోమవారం(జూన్ 24)న జరిగిన ఈ వివాహ వేడుకకు కుటుంబ సభ్యులు, కొద్ది మంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.   

ఇది పెద్దలు కుదిర్చిన వివాహం.. మార్చి 11న ఆర్తి, విశరధ్‌ ల ఎంగేజ్మెంట్ జరిగింది.  వివాహ వేడుక అనంతరం ఆర్తి చాబ్రియా సన్నిహితులు వీరి పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో విషయం బయటకు పొక్కింది. 2003లో తెలుగులో 'ఒకరికి ఒకరు' సినిమాలో నటించింది. ఆ తరువాత తెలుగులో 'ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి', 'గోపి గోడమీద పిల్లి' వంటి చిత్రాల్లో నటించింది.

కాగా, విశరద్ బీడసే సినిమా రంగానికి చెందిన వ్యక్తి కాదు. ఆయన చార్టెడ్ అకౌంటెంట్, ఇంటర్నేషనల్ టాక్స్ కన్సల్టెంట్. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పని చేస్తున్నారు. త్వరలోనే ఇండియాకు షిప్ట్ అవుతారని, ముంబైలో కాపురం పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: