కొన్నాళ్లుగా బాలీవుడ్ లో బ్యాడ్ టైం నడుస్తున్న షాహిద్ కపూర్ కు లక్కీగా అర్జున్ రెడ్డి రీమేక్ బ్లాక్ బస్టర్ అందించింది. ఇక్కడ విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి సినిమాను బాలీవుడ్ లో కబీర్ సింగ్ గా తీసి సూపర్ హిట్ కొట్టాడు షాహిద్ కపూర్. సందీప్ వంగ డైరక్షన్ లో తెరకెక్కిన ఆ సినిమా లాస్ట్ వీక్ రిలీజై సూపర్ హిట్ కలక్షన్స్ తో దూసుకెళ్తుంది.


ఇలాంటి హిట్టు కోసం ఎన్నాళ్ల నుండో ఎదురుచూస్తున్న షాహిద్ కపూర్ కబీర్ సింగ్ పై వస్తున్న నెగటివ్ కామెంట్స్ ను ఏమాత్రం పట్టించుకోకుండా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక ఇప్పుడు మరో తెలుగు సినిమాపై కన్నేశాడు షాహిద్ కపూర్. నాచురల్ స్టార్ నాని హీరోగా గౌతం తిన్ననూరి డైరక్షన్ లో వచ్చిన సినిమా జెర్సీ.


నానిని నాచురల్ స్టార్ అని ఎందుకు అంటారో మరోసారి ప్రూవ్ చేసిన సినిమా అది. కమర్షియల్ గా పర్వాలేదనిపించిన ఈ సినిమా దర్శకుడు గౌతం కు, హీరో నానికి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఈ సినిమాను కూడా బాలీవుడ్ లో రీమేక్ చేయబోతున్నారట. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమా రీమేక్ రైట్స్ ను కరణ్ జోహార్ దక్కించుకున్నాడని తెలుస్తుంది.


హింది జెర్సీలో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తాడని టాక్. కబీర్ సింగ్ తో సూపర్ హిట్ కొట్టిన షాహిద్ ఆ వెంటనే జెర్సీతో అదరగొట్టేందుకు రెడీ అవుతున్నాడు. హింది జెర్సీని కూడా గౌతం తిన్ననూరి డైరెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. చూస్తుంటే షాహిద్ కపూర్ కు మంచి రోజులు వచ్చాయని తెలుస్తుంది.    



మరింత సమాచారం తెలుసుకోండి: