ఇటీవల ‘కల్కి’ ట్రైలర్ చూసినప్పుడు తాను షాక్‌కు గురయ్యానని, తాను రాసుకున్న కథతోనే సినిమా తీశారని కార్తికేయ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 2009లోనే రిజిస్టర్ చేసుకున్నానని స్క్రిప్టును కూడా అందజేశారు. ఈ వివాదంలో రచయిత, దర్శకుడు బీవీఎస్ రవి మధ్యవర్తిత్వం చేశారు. విషయాన్ని డైరెక్టర్స్ అసోసియేషన్ దృష్టికి తీసుకెళ్లారు.

 

వాస్తవానికి, ఇలాంటి కాపీరైట్ వివాదాలు ఇండస్ట్రీలో ఎక్కువైపోవడంతో వాటిని పరిష్కరించడానికి ‘కథా హక్కుల వేదిక’ను బీవీఎస్ రవి ఏడాది క్రితం ప్రారంభించారు. విషయం కోర్టుల వరకు వెళ్లకుండా ఇక్కడే పరిష్కారం కావడానికి రవి ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగానే తాజాగా ‘కల్కి’ కాపీరైట్ వివాదాన్ని పరిష్కరించారు.

 

‘కల్కి’ కాపీరైట్ వివాదం గురించి బీవీఎస్ రవి ఇటీవల డెక్కన్ క్రానికల్‌తో మాట్లాడుతూ.. ‘కార్తికేయ మాకు ఇచ్చిన స్క్రిప్ట్.. ‘కల్కి’ కథ వేరుగా ఉన్నాయి. ఎక్కడా రెండింటికి పోలిక లేదు. ఈ విషయంలో మేం మధ్యవర్తిత్వం వహించి వివరణ ఇచ్చినా ఆయన సంతృప్తిగా లేరు. దీనిపై ఇంకా చర్చలు జరపాల్సి ఉంది. ఒకవేళ ఈ రెండు స్క్రిప్టలలో పోలిక ఉంటే, కార్తికేయకు క్రెడిట్ ఇవ్వాల్సిందే. అని చెప్పారు.

 

కాగా, ఈ వివాదంలో తుది నిర్ణయం తీసేసుకున్నట్లు తెలుస్తోంది. కార్తికేయ కథ, ‘కల్కి’ స్క్రిప్ట్‌లకు పోలిక లేదని స్పష్టం చేశారట. కథా హక్కుల వేదిక నిర్ణయంపై కార్తికేయ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. తాము తీసుకున్న నిర్ణయంతో సంతృప్తి చెందని పక్షంలో కోర్టుకు వెళ్లొచ్చని బీవీఎస్ రవి సూచించారట. కాబట్టి, కార్తికేయ కోర్టుకు వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: