టాలీవుడ్‌లో తాగుబోతు పాత్రకి లేటు ఎం.ఎస్ నారాయణగారు ఎలా పాపులరో, నేడు తాగుబోతు క్యారెక్టర్‌కి తాగుబోతు రమేష్ అంత పాపులరయ్యాడు. అందుకే రమేష్ రమిల్ల కాస్తా.. సినిమాల్లోకి వచ్చాక వరుస తాగుబోతు క్యారెక్టర్‌లతో తాగుబోతు రమేష్‌గా మారారు.

 

అయితే రీల్ లైఫ్‌లో తాగుబోతుగా ప్రేక్షకుల్ని మెప్పిస్తున్న తాగుబోతు రమేష్.. రియల్ లైఫ్‌లో అసలు మందే ముట్టడట. చాలా మంది హీరోయిన్స్ సైతం మందుకొట్టిన సీన్లలో నటించాలంటే క్యారెక్టర్ పర్ఫెక్షన్ కోసం నిజంగానే మందుతాగుతారు.

 

అలాంటిది తాగుబోతు రమేష్‌కి మందు టేస్ట్ చేయకుండానే తాగుబోతు పాత్రలో ఊగి తూలుతాడు. ఇంతిలా పర్ఫెక్ట్ పర్ఫెక్షన్ ఎలా వచ్చింది అంటే.. మానాన్న ఫుల్ డ్రింకర్ కావడంతో ఆయన మేనరిజాన్ని చిన్నప్పటి నుంచి చూసి సేమ్ టు సేమ్ ఇలా దింపేస్తున్నా.. జీవితం నేర్పిన పాఠంలో నుండి వచ్చిన పర్ఫెక్షనే ఈ తాగుబోతు పాత్ర అంటున్నారు తాగుబోతు రమేష్.

 

మరి ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీలకు వెళ్లినప్పుడు ఏం చేస్తావ్.. అంటే ఏముంది థమ్స్ అప్ తీసుకుంటా.. కిక్ ఎక్కేస్తాది అంటున్నాడు రమేష్. అయినా తన ఫ్రెండ్స్‌లో వేణు, ధనరాజ్ వీళ్లు మాత్రమే తాగుతారని.. మిగిలిన వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి లాంటి వాళ్లు తాగరన్నారు. చాలా వరకూ మందు పార్టీలకు దూరంగా ఉంటానన్నారు రమేష్.


మరింత సమాచారం తెలుసుకోండి: