ఇటీవల కొద్దిరోజుల క్రితం టాలీవుడ్ సినిమా పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ పేరుతో తెలుగు అమ్మాయిలపై జరుగుతున్న అకృత్యాలపై నిరసన వ్యక్తం చేస్తూ అప్పట్లో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ముందు అర్ధనగ్న ప్రదర్శన చేసిన శ్రీరెడ్డి, ఆ తరువాత అదే అంశంపై కొన్నాళ్ళు పోరాడింది. ఇక అక్కడినుండి ఆమెకు మరికొందరి మద్దతు లభించడంతో ఇకపై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్లో ఆడవారికోసం ప్రత్యేక విభాగాల ఏర్పాటు మరియు రక్షణ కల్పించడం జరుగుతుందని వారు కూడా ప్రకటించారు. 

అయితే ఆ అంశం కొన్నాళ్ల తరువాత మెల్లగా సర్దుకున్నది. అయితే ఆ సమయంలో శ్రీరెడ్డి చేస్తున్న పోరాటాన్ని పట్టించుకోకపోగా ఆమె సినిమా అవకాశాల ఇప్పించమని, అలానే సినిమాల్లో ఎక్కువగా తెలుగు అమ్మాయిలనే తీసుకోవాలని కోరితే, నటి హేమతో సహా మరికొందరు నటీమణులు శ్రీరెడ్డి పై పలువిధాలుగా విమర్శలు చేసారని, ఇక ఇటీవల జరిగిన మా అసోసియేషన్ మీటింగ్ లో తనతో పాటు చాలామంది తెలుగు వాళ్లకు సినిమాల్లో అవకాశాలు రావడం లేదని నటి హేమ ఆవేదనతో విలపించడం చూస్తే, తనదాకా వస్తేకాని ఆమెకి తెలియదా అంటూ ఒక యూట్యూబ్ మీడియా ఛానల్ వారు హేమ వైఖరిని తప్పుపట్టడం జరిగింది. నిజానికి గతంలో కోట శ్రీనివాసరావు వంటి వారు కూడా తెలుగు వారినే మన సినిమాల్లో ఎక్కువగా తీసుకోవాలని కోరేవారని, 

అలానే శ్రీరెడ్డి సహా మరికొందరు దీనిపై ఉద్యమం చేస్తే ఎవ్వరూ పట్టించుకోలేదని, ఇప్పుడు తనదాకా వచ్చాకే హేమకు గుర్తుకువచ్చిందా అంటూ ఆ సదరు ఛానల్ ఆమెపై కామెంట్స్ చేసింది. ఇక ఈ వీడియోను కాసేపటి క్రితం శ్రీరెడ్డి షేర్ చేస్తూ, బాగా చెప్పారు సర్, మా బాధను కనీసం మీరైనా బాగా అర్ధం చేసుకున్నందుకు ధన్యవాదాలు అంటూ ఆ వీడియోని తన సోషల్ మీడియా మాధ్యమాల్లో షేర్ చేసింది. అయితే ఇది ప్రత్యక్షంగా కాకపోయినా ఒకరకంగా పరోక్షంగా నటి హేమకి, శ్రీరెడ్డి ఇచ్చిన షాక్ అనే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు....!!  


మరింత సమాచారం తెలుసుకోండి: