దేశ వ్యాప్తంగా టెలివిజన్ రంగంలో ఎన్నో సంచలనాలు రేపిన రియాల్టీ షో బిగ్ బాస్.  బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ 12వ సీజన్ ముగిసింది.  తెలుగు, తమిళ, కన్నడ, మళియాళ భాషల్లో కూడా బిగ్ బాస్ వస్తుంది. తెలుగు లో ఇప్పటికే రెండు సీజన్లు ముగియగా మొదటి సీజన్ కి ఎన్టీఆర్, రెండో సీజన్ కి నాని హూస్ట్ గా వ్యవహరించారు.  ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 3 రాబోతుంది..అయితే ఈ షోకి హూస్ట గా నాగార్జున ఉండబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. 

ఈ మద్య ఓ ప్రోమో రిలీజ్ కాగా ఆ ముసుగు మనిషి నాగార్జున అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ముంబై హాట్ మోడల్ గా గుర్తింపు తెచ్చుకున్న తెలుగమ్మాయి శోభితా ధూళిపాళ బిగ్ బాస్ 3లో కంటెస్టెంట్ గా రానున్నట్లు టాక్ వచ్చింది. తెలుగు లో గూఢాచారి సినిమాలో నటించిన శోభితా నటనకు మంచి మార్కులు పడ్డాయి.  బాలీవుడ్ లో మరికొన్ని మూవీస్ లో నటిస్తుంది. తాజాగా బిగ్ బాస్ 3 లో తాను కంటెస్టెంట్ ఉండబోతున్న విషయంపై క్లారిటీ ఇచ్చింది ఈ హాట్ బ్యూటీ.

నాకసలు  బిగ్ బాస్ లో కనిపించాలనే ఆలోచన ఎంత మాత్రం లేదు. బిగ్ బాస్ కి సంబందించిన ఎలాంటి ప్రస్తావన నా వద్దకు రాలేదు, కొంత మంది మీడియా రేటింగ్ కోసం ఇలాంటి రూమర్లు సృష్టిన్నారు.  అనవసరంగా మీ స్వలాభం కోసం రూమర్స్ స్ప్రేడ్ చేయవద్దని అమ్మడు మీడియాకు ఒక వివరణ అయితే ఇచ్చింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: