తాజాగా కౌశల్ ఓ సంచలన ప్రకటన చేశాడు. మూడు రోజుల క్రితం హన్మకొండలో కామాంధుడి చేతిలో హత్యాచారానికి గురైన శ్రీహిత కోసం నిరాహారదీక్ష చేయడానికి ముందుకు వచ్చాడు. దీని కోసం శనివారం అర్ధరాత్రి సమయంలో ఓ వీడియోను పోస్ట్ చేశాడు. ఇందులో భాగంగానే ఆదివారం హన్మకొండలో నిరాహార దీక్ష చేయడానికి ప్రయత్నం చేశాడట. కానీ, పోలీసులు ఈ దీక్షకు అనుమతి లేదంటూ భగ్నం చేశారని చెప్పుకొచ్చాడు.

 

మేము వరంగల్ వెళ్లి శ్రీహిత కుటుంబాన్ని కలుసుకున్నాం. మేము అండగా ఉంటామని చెప్పడంతో ఆమె తల్లిదండ్రులు ఎంతగానో సంతోషించారు. శ్రీహిత చనిపోయిన 11 రోజుల లోపే నిందితుడ్ని శిక్షిస్తాం అంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి తమకు హామీ వచ్చిందని శ్రీహిత తండ్రి జగన్ మాకు చెప్పారు. ఇక నేను చేపట్టిన నిరాహారదీక్షను పోలీసులు భగ్నం చేసి.. సోమవారం వరకూ సమయం కోరారు. అప్పటి వరకూ వేచి చూస్తాం... అని చెప్పారు.

 

వాస్తవానికి అంతకు ముందు కౌశల్ ఓ వీడియోను పోస్ట్ చేశాడు. అందులో నిరాహార దీక్ష చేయబోతున్నట్లు ప్రకటించాడు. ఇందులో దీక్షకు సంబంధించిన వివరాలను వెల్లడించాడు. "అందరికీ నమస్కారం. హన్మకొండలో చిన్నారి శ్రీహితకు జరిగిన అన్యాయం మనందరికీ తెలిసిందే. అప్పటి నుంచి ప్రతి ఒక్కరూ శ్రీహితకు న్యాయం కావాలని కోరుతున్నారు. కానీ, అటు పోలీసుల నుంచి కానీ, ఇటు న్యాయస్థానం నుంచి కానీ ఎటువంటి న్యాయం జరగలేదు. అందుకే మేము రెండు అడుగులు ముందుకేసి శ్రీహిత కోసం ఆమరణ నిరాహార దీక్ష చేద్దామని అనుకుంటున్నాం.

 

రేపు ఉదయం 10 గంటలకు ఆమె తల్లిదండ్రులను కలుసుకుని, అక్కడి నుంచి మెజిస్ట్రేట్ ఎదురుగా ఈ దీక్ష చేయాలనుకుంటున్నాం. ఎవరైతే శ్రీహితకు న్యాయం కావాలని కోరుకుంటున్నారో.. ఎవరైతే ఇలాంటి సంఘటనలు ముందు ముందు జరగకూడదని కోరుకుంటున్నారో.. వాళ్లందరూ వచ్చి మాతో పాలుపంచుకుని ఈ దీక్షను విజయవంతం చేస్తారని, శ్రీహితకు న్యాయం జరిగేలా చేస్తారని, అందరూ ఉప్పెనలా మారి ఈ సంఘటనకు ఎదురు తిరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా" అంటూ అందులో పేర్కొన్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: