కొంతమంది రివ్యూ రైటర్లు అర్జున్ రెడ్డి సినిమా లాగానే రీసెంట్‌గా బాలీవుడ్‌లో రిలీజైన 'కబీర్ సింగ్' మీద విరుచుకుపడ్డారు. హీరో ఆటిట్యూడ్ బాగా లేదంటూ సినిమాకు నెగిటివ్ రేటింగులు ఇచ్చారు. వాళ్ళకి నచ్చకపోతే నచ్చకపోయాడు కానీ ప్రేక్షకులను మాత్రం తెలుగు అర్జున్ రెడ్డి లాగానే కబీర్ సింగ్ కూడా ఆకట్టుకుంటున్నాడు. షాహిద్ కపూర్ సినిమాల్లోనే బెస్ట్ కలెక్షన్స్ దిశగా పరుగులు తీస్తూ ఉంది 'కబీర్ సింగ్'. అంతేకాదు రికార్డ్స్ మీద రికార్డ్స్ క్రియోట్ చేస్తోంది. 


మొదటి మూడు రోజుల్లో ఈ సినిమా 70 కోట్లరూపాయల పై స్థాయి వసూళ్లను సాధించిందని బాలీవుడ్ ట్రేడ్ వర్గాల సమాచారం. తొలి రోజు ఈ సినిమా ఇరవై కోట్ల రూపాయలను, రెండో రోజు ఇరవై రెండు కోట్ల రూపాయలను, మూడో రోజు ఆదివారం దాదాపు ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలను వసూలు చేసిందని బాలీవుడ్ మీడియా ఫ్రెష్ అప్‌డేట్. 
ఇవన్నీ దేశీయంగా వచ్చిన వసూళ్లు మాత్రమే అని ఈ ట్రేడ్ ఎనలిస్ట్ వివరించాడు. మొత్తానికి తెలుగులో సూపర్ హిట్ అయిన 'అర్జున్ రెడ్డి' హిందీలోనూ అలాంటి స్థాయి ఫలితాన్నే నమోదు చేసేలా ఉంది. 


అంతేకాదు హీరోయిన్ కియారా అద్వానికి బాలీవుడ్‌లో ఈ సినిమాతో క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. అంతేకాదు షాహిద్ కి కూడా ఈ రేంజ్ హిట్ తన ఫిల్మ్ కెరీర్‌లో ఇప్పటి వరకు పడలేదు. దాంతో షాహిద్ కూడా ఈ సినిమాతో బాలీవుడ్‌లో తన మార్కెట్ పెరగనుందని కాన్‌ఫిడెంట్‌గా ఉన్నాడట. రిలీజ్ కు ముందు ఎన్నో అనుమానాలు, అవాంతరాలు, అడ్డంకులు. అయినా వాటన్నింటిని అధిగమించి కబీర్ సింగ్ సక్సస్ అయ్యాడు. ఒక్కసారి సినిమా ప్రేక్షకులకు నచ్చితే దానీ రికార్డ్స్ ఆపడం ఎవరి తరం కాదని కబీర్ సింగ్ ప్రూవ్ చేశాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: