రీసెంట్‌గా విడుదలైన వాల్మికి ప్రీ టీజర్ లో వరుణ్ తేజ్ లుక్ చూసి అందరూ షాక్ తిన్నారన్న సంగతి క్లియర్గానే అర్థమవుతుంది. రఫ్ గా ఉంటాడని ఊహించారు కానీ మరీ ఇంత రగ్డ్ అవతారం మాత్రం ఎవరూ ఊహించలేదు. ఎఫ్2లో  సరదాగా అల్లరి చేసింది వరుణేనా అని అనుమానం వచ్చేలా హరీష్ శంకర్ ఎక్స్ట్రార్డినరీగా వరుణ్ లుక్ ను డిజైన్ చేయించాడు. ఇదే గనక స్ట్రెయిట్ సినిమా అయితే ఈ  పాత్రలో ఎన్ని వేరియేషన్స్ ఉంటాయో అన్న కుతూహలం ఎక్కువగా ఉండేది. 
  
కానీ రీమేక్ కావడంతో ఒరిజినల్ వెర్షన్ జిగర్ తండా చూసిన వాళ్లకు ఈ పాత్ర స్వభావం బాగా గుర్తుండిపోయింది.. అందుకే గెటప్ బాగానే ఉంది కానీ సరదాగా కనిపించే రౌడీ డాన్ పాత్ర ను ఇంత సీరియస్ గా మార్చారే అనే అనుమానం మాత్రం అందరికి వస్తోంది. తమిళ్ లో ఈ రోల్ బాబీ సింహా చేశాడు. అయితే ఇంత రఫ్‌గా ఉండదు. కానీ ఇక్కడ వచ్చే సందేహాల వెనుక ఇంకో క్లారిటీ కూడా కనిపిస్తోంది.  హరీష్ శంకర్ గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చేసిన గబ్బర్ సింగ్ ల్యాండ్ మార్క్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 


అయితే పవన్ ఇమేజ్ కు తగ్గట్టు చేసిన మార్పులు  హీరోయిజం ఇంకా బాగా ఎలివేట్ అయ్యేలా రాసుకున్న డైలాగులు సినిమా రేంజ్ ని ఎక్కడికో తీసుకెళ్లాయి. అందుకే వాల్మీకి కూడా అదే ఫార్ములాను ఫాలో అయినట్టుగా కనిపిస్తోంది.  ఒరిజినల్ కన్నా బాగా తెలుగు రీమేక్స్ తీయడం చాలా అరుదు. అందులో గబ్బర్ సింగ్ ది ప్రత్యేక స్థానం. ఇప్పుడు వాల్మీకిని కూడా అదే తరహాలో తీర్చిదిద్దే హామీతోనే వరుణ్ ని హరీష్ శంకర్ ఒప్పించినట్టుగా ఇన్‌సైడ్ న్యూస్. ఏదైతేనేం మొత్తానికి షాకింగ్ లుక్ తో వరుణ్ లుక్ భారీ అంచనాలను క్రియోట్ చేసింది .  


మరింత సమాచారం తెలుసుకోండి: