పోకిరి హీరోయిన్ ఇలియానా ప్రస్తుతం అవకాశాలు లేకుండా తన బాయ్ ఫ్రెండ్ ఆండ్రూ నీబోన్‌తో సహజీవనం చేస్తుందని వార్తలు వస్తున్నాయి. ఆస్ట్రేలియా బాయ్ ఫ్రెండ్ తో కలసి ఉంటున్న ఇలియానా ప్రస్తుతం పెళ్ళికి సంబందించిన దుస్తుల్లో మెరిసింది. ఇంకా పెళ్ళికి సంబందించిన దుస్తులతో కూడిన ఫోటోలను సోషల్ మీడియాలో  పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్లో వైరల్ అయ్యాయి.


ఈ ఫోటోలను చుసిన వారు అందరూతో ఇలియానా రహస్య వివాహం చేసుకుందని అంటున్నారు. ఇంకా ఈ ఫోటోలను చూపిస్తూ మీడియా ప్రచారం చేస్తుంది. అయితే ఇలియానా ఈ వార్తలపై నోరు విప్పలేదు. 


కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ సినిమాల్లో నటించిన ఇలియానా, ప్రస్తుతం సినిమాల్లేకుండా ఆస్ట్రేలియాలో స్థిరపడిపోయింది. ఉన్నట్లుండి ఆమె వివాహం చేసుకుందని, గర్భంగా ఉందని కూడా ప్రచారం సాగింది.


మరింత సమాచారం తెలుసుకోండి: