నాగబాబు తన సొంత యూట్యూబ్ ఛానల్ ద్వారా అప్పుడప్పుడు అభిమానులను పలకరిస్తూ ఉంటారు. రీసెంట్ గా కొందరు  అభిమానులు అడిగిన ప్రశ్నలకు నాగబాబు తనదైన శైలిలో సమాధానాలు చెప్పారు. ఆ సందర్బంగా డబ్బు కున్న ఇంపార్టెన్స్  నాగబాబు మాట్లాడారు. జీవితంలో డబ్బు చాలా ముఖ్యం అని.. డబ్బు లేకుంటే బలం లేనట్లే అంటూ నాగబాబు డబ్బు విలువను చెప్పారు. అంతేకాదు మోటరు వాహనం నడవాలంటే ఇంధనం కావాలి, అలాగే జీవితం అనే బండి నడవాలి అంటే ధనం కావాలి. మనిషికి మానవత్వం.. మంచి వ్యక్తిత్వం ఉండాలని.. అప్పుడే గౌరవం వస్తుందని కొందరు అంటూ ఉంటారు. అవన్ని ఉత్తి మాటలే. 


మనిషికి అన్నింటి కంటే ముఖ్యంగా డబ్బు అవసరం చాలా ఉంది. దానిని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకుంటేనే సంతోషంగా ఉంటారని నాగబాబు చెప్పారు. డబ్బు లేక ఇబ్బంది పడ్డ సందర్బాలు నాకు ఉన్నాయి. నా 49వ సంవత్సరంలో డబ్బు విలువ తెలిసి వచ్చింది. అప్పటి నుండి బాగానే సంపాదించాను, పొదుపు చేశాను. అంతకు ముందు కూడా డబ్బును వృధా చేయలేదు. కాని అప్పుడు నాకు డబ్బు సంపాదించాలన్న కసి మాత్రం లేదు. ఎప్పుడైతే డబ్బులు లేక ఇబ్బంది కలిగిందో అప్పుడే నాలో కసి పెరిగింది. అప్పటి నుండి బాగా సంపాదించాను...అన్నారు.


ఉద్యోగంలో చేరిన మొదటి నుండే డబ్బు సంపాదన మొదలు పెట్టి పొదుపు చేసుకోవాలని నాగబాబు అందరికి సూచించారు. డబ్బు సంపాదించాలనే కసి కలగాలి అంటే 'ది రిచ్చెస్ట్ మ్యాన్ ఇన్ బాబిలాన్' పుస్తకం చదవాలని, ఆ పుస్తకంలో డబ్బు అవసరం ఎంత ఉంది.. అది లేకపోతే పరిస్థితి ఏంటీ అనే విషయాలను చక్కగా చెప్పారని వివరించారు. సంపాదనలో కనీసం 10 శాతం అయినా పొదుపు చేసుకోవాలని ఆ పుస్తకం చెబుతుందట. డబ్బు ఎంత పొదుపు చేస్తే అంత బలంగా తయారవ్వొచ్చు అంటూ నాగబాబు తన అనుభవాలను పంచుకున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: