మా టీవీలో తొందర్లోనే ప్రసారం కానుంది బిగ్ బాస్ 3. ఇప్పటికే రెండు సీజన్లను బాగా ఎంజాయ్ చేసిన ప్రేక్షకులకు మూడవది ఇపుడు చాలా ఆసక్తి రేపుతోంది. మొదటి దానికి ఎన్టీయార్ హోస్ట్ చేస్తే, రెండో సీజన్లో నాని వచ్చాడు. మూడవ సీజన్ కి నాగార్జున హోస్ట్ చేస్తున్నారని టాక్. మొత్తానికి ఈసారి చాలా మంది అందగత్తెలతో బిగ్ బాస్ 3 ని నింపేయాలని ప్లాన్.


ఇందులో ప్రముఖ యాంకర్లు కూడా ఉన్నారు. .  తాజా సమాచారం మేరకు బుల్లితెర మీద పాపులర్ అయిన ఇద్దరు లేడీ యాంకర్లను షోలోకి తీసుకుంటున్నారట.  వాళ్ళే శ్రీముఖి, లాస్య.  పలు టీవీ షోలతో ఈ ఇద్దరూ తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరైన సంగతి తెలిసిందే. 


మరి ఈ రియాలిటీ షోలో వీరి అసలు  యాటిట్యూడ్ తో మరింతగా దగ్గరవుతారని అంటున్నారు. ఈ ఇద్దరు ముద్దు గుమ్మల అలవాట్లు, పొరపాట్లు అన్నీ కూడా బుల్లి తెర సాక్షిగా చూసేయవచ్చు. ఇక వీరే కాదు. చాలా మంది బ్యూటీస్ తో ప్యాక్ చేయబడిన ఫుల్ ఎంటర్టైనర్ బిగ్ బాస్ 3 అంటున్నారు నిర్వాహకులు.
 



మరింత సమాచారం తెలుసుకోండి: