రౌడీ హీరో విజయ్ ప్రస్తుతం డియర్ కామ్రేడ్ సినిమా చేస్తున్నాడు. భరత్ కమ్మ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. గీతా గోవిందం సినిమాలో ఈ ఇద్దరి జోడీ అదరగొట్టింది. కేవలం ఆన్ స్క్రీన్ మీదే కాదు ఆఫ్ స్క్రీన్ లో వీరి జోడీ అలరిస్తుంది.


అదెలా అంటారా సినిమాతో సంబంధం ఉన్నా లేకున్నా ఈమధ్య విజయ్ ఎక్కడ ఉంటే అక్కడ రష్మిక కనిపిస్తుంది. మహేష్ మహర్షి సక్సెస్ ట్రీట్ లో మహేష్ బాబు ఇంట్లో విజయ్ వెంటే వచ్చింది రష్మిక ఇక విజయ్ ఉన్నాడు అంటే అక్కడ రష్మిక కూడా ప్రత్యక్షమవుతుంది. రీసెంట్ గా ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమా చూసిన విజయ్ ఆ తర్వాత జూబ్లీ హిల్స్ లో ఓ హోటెల్ లో పార్టీ చేసుకున్నారట.


ఆ పార్టీలో దిగిన పిక్స్ ఇప్పుడు బయటకు వచ్చాయి. విజయ్ అండ్ ఫ్రెండ్స్ గ్యాంగ్ లో రష్మిక మందన్న కూడా ఉంది. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విజయ్, రష్మికల మధ్య ఉన్నది స్నేహమేనా ఇంకా వేరే రిలేషన్ ఏదైనా ఉంటుందా అన్నది తెలియాల్సి ఉంది. ఆన్ స్క్రీన్ పెయిర్ బాగుంది అంటే ఇలాంటి రూమర్స్ రావడం సహజమే కాని ఇలా కలిసి తిరుగుతుంటే మాత్రం ఆలోచించాల్సిందే.


కెరియర్ పరంగా విజయ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఓ పక్క రష్మిక కూడా సూపర్ ఛాన్సులు అందుకుంటుంది. మరి వీరిద్దరి మధ్య ఉన్న రిలేషన్ కేవలం స్నేహమేనా లేదా ఇంకేదైనా ఉందా అన్నది ఇద్దరిలో ఎవరో ఒకరు చెబితేనే తెలుస్తుంది. గీతా గోవిందం సినిమాతో హిట్ పెయిర్ గా క్రేజ్ తెచ్చుకున్న ఈ జంట మరిన్ని సినిమాలు చేసేలా కనిపిస్తున్నారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: