ఆసు యంత్రాన్ని కనిపెట్టి చేనేత పరిశ్రమకు ఎంతో మేలు చేసిన చింతకింది మల్లేశం జీవిత కథతో తెరకెక్కిన సినిమా మల్లేశం. రాజ్ ఆర్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో మల్లేశం పాత్రలో ప్రియదర్శి నటించాడు. మల్లేశం తల్లి పాత్రలో ఝాన్సి నటించగా అనన్య మల్లేశం భార్య పాత్రలో నటించారు. 


ఎప్పుడు కామెడీ పాత్రలు చేస్తూ వస్తున్న ప్రియదర్శిలో కూడా ఓ మంచి నటుడు ఉన్నాడని ప్రూవ్ చేసిన సినిమా మల్లేశం. అయితే దర్శకుడు రాజ్ ఆర్ ఈ సినిమా కథను స్టార్ హీరోలతో చేద్దామని అనుకున్నాడట. ఈ క్రమంలోనే నాని, విజయ్ దేవరకొండ వంటి స్టార్స్ తో కలిసి కథాచర్చలు జరిపాడట.


కథ మరీ డాక్యుమంటరీగా ఉందని సినిమాని కాదన్నారట. కచ్చితంగా మల్లేశం సినిమాను నాని, విజయ్ దేవరకొండ చేసి ఉంటే ఆ రేంజ్ వేరేలా ఉండేది. అయితే ఈ పాత్రకు హీరో ఇమేజ్ లేకుండా ఉంటేనే బెటర్ అలా చూస్తే మల్లేశం పాత్ర చేసిన ప్రియదర్శినే ఈ పాత్రకు పర్ఫెక్ట్ అంటున్నారు. సినిమాలో కొన్ని సీన్స్ లో ప్రియదర్శి నటనకు ఆడియెన్స్ ఫిదా అయ్యారు.


నాని, విజయ్ దేవరకొండ ఇద్దరిలో ఎవరు చేసినా వారి ఇమేజ్ కు తగినట్టుగా కథను మార్చాల్సి ఉండేది. కాని ప్రియదర్శి విషయంలో దర్శకుడు తాను చెప్పాలనుకున్న మల్లేశం నిజ జీవిత కథను చక్కగా చెప్పాడు. సినిమా చూసిన ప్రేక్షకులు కూడా రియల్ లైఫ్ మల్లేశం గురించి వెతకడం మొదలు పెట్టారు.



మరింత సమాచారం తెలుసుకోండి: