టాలీవుడ్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించిన చివరి సినిమా భరత్ అనే నేను విడుదలయ్యి దాదాపు సంవత్సరం కావస్తుంది. పైన గానీ ఇప్పటివరకు కొరటాల శివ సినిమా ఇంకా స్టార్ట్ కాలేదు. భరత్ అనే నేను సినిమా తర్వాత చిరంజీవితో సినిమా ఎనౌన్స్ చేసిన కొరటాల శివ మొన్నటి వరకు అదిగో ఇదిగో అంటూ మెగాస్టార్ సినిమా వాయిదా వేయడం జరిగింది.


'సైరా' సినిమా షూటింగ్ ఆలస్యం క్రమంలో తమ సినిమా ఆలస్యం అవుతోందని లేకపోతే ఈ పాటికి ఎప్పుడో సినిమా షూటింగ్ మొదలయ్యేది అని ఇటీవల కొరటాల పేర్కొన్నట్టు టాక్. అయితే తాజాగా ఇప్పుడు కొరటాల సినిమా చిరంజీవి అన్ని విధాలా లైన్ క్లియర్ చేసి సినిమా షూటింగ్ కి రెడీ అయినట్లు ఫిలింనగర్ టాక్. గతంలో మెగాస్టార్ చిరంజీవి సైరా సినిమాకి ఎక్కువ సమయం తీసుకుంటున్న క్రమంలో మరోపక్క పరిటాల తో కూడా సినిమా మొదలు పెడితే బాగుంటుందని అనుకున్నారట.


కానీ వయసు రీత్యా   రెండు సినిమాలను ఒకేసారి చేయడం వల్ల ఒత్తిడికి గురవ్వాల్సి వస్తుందనే ఉద్దేశ్యంతో రెండు చిత్రాలకు నిర్మాత అయిన రామ్ చరణ్ ఈ చిత్రాన్ని కాస్త హోల్డ్ లో పెట్టాడు. కొరటాల శివను ఒప్పించి రామ్ చరణ్ వెయిటింగ్ లో పెట్టాడు. అయితే తాజాగా ఇప్పుడు ఆగస్టు నెల నుండి కొరటాల సినిమాను ఎలాగైనా మొదలు పెట్టేయండి అంటూ నిర్మాత రామ్ చరణ్ కి చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఫిలింనగర్ లో వార్తలు వినబడుతున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: