నటుడు రాజశేఖర్ తో 'కల్కి' అనే సినిమా తీసిన కుర్ర డైరెక్టర్ ప్రశాంత్ వర్మ నందమూరి బాలకృష్ణ తో సినిమా చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో అ! అనే సినిమాతో ఇండస్ట్రీకి డైరెక్టర్ గా పరిచయం అయిన ప్రశాంత్ వర్మ సినిమా విజయంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు తాజాగా రాజశేఖర్ తో కల్కి అనే సినిమా తీసి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు.


ఇదిలా ఉండగా తాజాగా కల్కి సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్లో భాగంగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమా గురించి అనేక విషయాలు మాట్లాడుతూ మరోపక్క భవిష్యత్తులో చెయ్యబోయే ప్రాజెక్టుల గురించి అనేక విషయాలు తెలియజేశారు. గతంలో మెగాస్టార్ చిరంజీవి - బాలకృష్ణని ఒకే తెరపై చూపించేలా మల్టీస్టారర్ చేయాలనీ ఉందని చెప్పిన ప్రశాంత్ రీసెంట్ గా కుదిరితే బాలకృష్ణతో సపరేట్ గా ఒక ప్రయోగాత్మక చిత్రాన్ని తెరకెక్కించాలని ఉందని అన్నాడు.


అందుకు కొన్ని క్రేజీ ఆలోచనలు కూడా ఉన్నట్లు చెప్పాడు. బాలకృష్ణ గతంలో ఎన్నో ప్రయోగాలు చేశారు. అయితే ఫ్యాన్స్ ను దృష్టిలో ఉంచుకొని ఈ మధ్య అదే ఫార్మాట్ లో సినిమాలు చేయాల్సి వస్తోంది. ఆయనతో సెట్టయితే కొన్ని స్పెషల్ కథలు రెడీ చేస్తానని వివరణ ఇచ్చాడు. మరి బాలకృష్ణ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఆలోచనలకు ఎలా స్పందిస్తారో చూడాలి.

 



మరింత సమాచారం తెలుసుకోండి: