బాలకృష్ణకు అంబికాకృష్ణకు మధ్య ఉన్న సాన్నిహిత్యం ఓపెన్ సీక్రెట్. బాలయ్య రాయబారాలతోనే అంబికాకృష్ణకు గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మెన్ పదవి వచ్చింది అని కూడ చాలామంది అంటారు. దీనికితోడు బాలయ్యతో అంబికాకృష్ణ సినిమాలు తీయడమే కాకుండా అతడి సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసిన సాన్నిహిత్యం కూడ వీరిద్దరి మధ్య గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉంది.

ఇలాంటి పరిస్థుతులలో ప్రస్తుతం కష్టకాలంలో ఉన్న తెలుగుదేశం పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలో చేరిపోతు అంబికాకృష్ణ చేసిన కామెంట్స్ పరోక్షంగా బాలకృష్ణకు తలనొప్పిగా మారాయి అని వార్తలు వస్తున్నాయి. గత ఎన్నికలలో చంద్రబాబు అనుసరించిన విధానాలు వల్ల తెలుగుదేశం పార్టీకి ఘోర పరాజయం వచ్చింది అని చెపుతూ తాను చంద్రబాబు ప్రవర్తనకు నిరసనగా తెలుగుదేశం పార్టీని వీడుతున్న విషయాలను వివరించాడు. 

అయితే ఇక్కడ వరకు సమస్య లేకపోయినా ఇక్కడ అంబికా కృష్ణ మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ తాను పార్టీ మారుతున్న విషయం బాలకృష్ణకు చెప్పాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేసారు. ఇప్పుడు అంబికాకృష్ణ చేసిన కామెంట్స్ పై నందమూరి అభిమానులలో లోతైన చర్చలు జరుగుతున్నాయి. బాలకృష్ణకు తెలిసి కూడ అంబికాకృష్ణ పార్టీ మారే విషయంలో ఎందుకు అడ్డుపడలేదు అంటూ పార్టీ ఓటమి పై బాలయ్యకు కూడ అసంతృప్తి ఉందా అంటూ నందమూరి అభిమానులు సందేహాలు వ్యక్త పరుస్తున్నారు. 

ప్రస్తుత పరిస్థుతులలో తెలుగుదేశం పార్టీని రక్షించగల శక్తి ఒక్క నందమూరి ఫ్యామిలీకి మాత్రమే ఉంది అని భావించే అభిమానులు ఈమధ్య కాలంలో ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఓటమి తరువాత బాలకృష్ణ అనుసరిస్తున్న మౌన వ్యూహం పై సందేహాలు వ్యక్తపరుస్తూ అసలు తెలుగుదేశంలో ఏమి జరుగుతోంది అంటూ బాలయ్య అభిమానులు తీవ్ర ఆందోళనలో ఉన్నట్లు టాక్. అయితే ఈవిషయాలు ఏమి పట్టించుకోకుండా బాలయ్య ప్రస్తుతం తన దృష్టి అంతా కెఎస్ రవికుమార్ మూవీ ప్రాజెక్ట్ పై పెట్టినట్లు తెలుస్తోంది..    


మరింత సమాచారం తెలుసుకోండి: