పవన్ కళ్యాణ్ కు మంచి పేరు తీసుకొచ్చిన సినిమాల్లో గబ్బర్ సింగ్ ఒకటి.  ఈ సినిమా సూపర్ హిట్ కొట్టింది. ఈ సినిమా తరువాత అందరు పవన్ ను గబ్బర్ సింగ్ అని పిలవడం మొదలుపెట్టారు.  పవన్ ఇందులో కొద్దిగా నెగెటివ్ ఛాయలున్న పాత్రలో కనిపించాడు.  


నెగెటివ్ ఛాయలే అవి విలన్ కు.  గబ్బర్ సింగ్ అనేది ఒక రౌడీ పేరు.  ఆ పేరుతోనే సినిమా తీసి హిట్ కొట్టడం విశేషం.  హరీష్ శంకర్ ఈ సినిమాను డిజైన్ చేసిన తీరు బాగుంటుంది.  ఇప్పుడు ఇదే ఫార్ములాను వరుణ్ తేజ్ కోసం యూజ్ చేస్తున్నాడు.  వరుణ్ తేజ్ తో వాల్మీకి చేస్తున్నాడు. 


వాల్మీకి అంటే ఒక ఋషి.  బోయవాడు నుంచి వాల్మీకిగా ఎలా మారాడు అన్నది పురాణం.  ఇప్పుడు ఇది కూడా అలాంటిదే.  చెడ్డవాడుగా ఉన్న వరుణ్ కొన్ని పరిణామాల కారణంగా మంచి వాడుగా ఎలా మారాడు అన్నది కథ.  తమిళంలో హిట్ కొట్టిన జిగర్తాండ సినిమాకు రీమేక్ ఇది.  


వరుణ్ తేజ్ మేకోవర్ సూపర్బ్ గా ఉన్నది.  మాసిన పొడవైన గడ్డం, చేతిలో నాటు తుపాకీ, కంటికింద ఒక చార చూస్తుంటే చాలా భయంకరంగా ఉన్నాడు.  ఒరిజినల్ వెర్షన్ లో బాబీని ఇలా చూపించలేదు.  కానీ, తెలుగు సినిమాకు కాస్త మాస్ టచ్ ఇచ్చేందుకు హరీష్ ఈ ఫార్ములాను ఎంచుకున్నాడు.  మరి హిట్ కొడతాడంటారా..


మరింత సమాచారం తెలుసుకోండి: