మహర్షి విజయం తరువాత మహేష్ విదేశాలకు వెళ్లారు.  ఆయన విదేశాల్లో ఉండగానే మే 31 వ తేదీన సరిలేరు నీకెవ్వరూ మూవీ ప్రారంభం అయ్యింది.  అదే రోజున మహేష్ సినిమా టైటిల్ ను విదేశాల్లో నుంచే రిలీజ్ చేశారు.  సరిలేరు నీకెవ్వరూ టైటిల్ వెరైటీగా ఉన్నది.  


ఎప్పుడు మూడు అక్షరాలకు ప్రాధాన్యత ఇచ్చే మహేష్ ఈసారి చాలా పెద్ద టైటిల్ ను పెట్టేందుకు ఒకే చెప్పడం విశేషం.  ఇదిలా ఉంటె, మహేష్ బాబు కొన్ని రోజుల క్రితమే విదేశాల నుంచి తిరిగి వచ్చారు. వచ్చిన తరువాత సరిలేరు నీకెవ్వరూ సినిమా గురించి ఏమైనా మాట్లాడతారు అనుకుంటే ఏమి మాట్లాడలేదు.  


జులై 5 నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాబోతున్నది.  అంటే మరో పది రోజుల్లో షూటింగ్ స్టార్ట్ అవుతుంది.  ఇలాంటి విషయాలలో మహేష్ చురుగ్గా ఉంటారు.  తన సినిమా గురించి అభిమానవులతో పంచుకుంటుంటాడు.  కానీ, అలాంటిది ఏమి హింట్ ఇవ్వలేదు.  


మరో విషయం ఏమిటంటే..జూన్ 28 వ తేదీన శిల్పకళా వేదికలో మహర్షి 50 రోజుల వేడుక జరగబోతున్నది.  ఈ వేడుకలోనైనా సరిలేరు నీకెవ్వరూ గురించి మాట్లాడతారా లేదంటే సినిమా షూటింగ్ సమయంలోనే మాట్లాడతారా చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: