ఈ సంవత్సరంలో విడుదల కాబోయే సినిమాలలో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ వర్గాలు అత్యంత ఆసక్తితితో ఎదురు చూస్తున్న సినిమాలు రెండే రెండు. వాటిలో ఒకటి ‘సాహో’ అయితే మరొకటి ‘సైరా’ రికార్డులను బ్రేక్ చేయడమే ప్రధాన ధ్యేయంగా నిర్మాణంలో ఉన్న ఈమూవీ ఫలితాలు గురించి చిరంజీవి ప్రభాస్ అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

ఇలాంటి పరిస్థుతులలో చిరంజీవి పుట్టినరోజునాడు విడుదల కాబోతున్న ‘సైరా’ టీజర్ ‘సాహో’ టీజర్ నుండి పాఠాలు నేర్చుకుంటోంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ‘సాహో’ టీజర్ కు అనూహ్యమైన స్పందన వచ్చినా ఆ టీజర్ గ్రాఫిక్స్ విషయంలో అక్కడక్కడ దొర్లిన పొరపాట్ల పై లోతైన చర్చలు జరిగాయి. 

దీనితో అటువంటి పొరపాట్లు లేకుండా ‘సాహో’ టీజర్ లో కనిపించే గ్రాఫిక్స్ హాలీవుడ్ మూవీల స్థాయిలో ఉండాలి అని చిరంజీవి ఇప్పటికే ‘సైరా టీమ్ కు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు టాక్. దీనికితోడు ‘సైరా’ కథ స్వాతంత్రోద్యమ నేపధ్యంలో ఉంటుంది కాబట్టి గ్రాఫిక్స్ విషయంలో ఏ చిన్న పొరపాటు జరిగినా ఫలితాలు దారుణంగా ఉండి ఈమూవీ మార్కెట్ పై తీవ్ర ప్రభావాన్ని చూపెడతాయి అని చిరంజీవి అభిప్రాయం అని అంటున్నారు. 

దీనితో చిరంజీవి దృష్టి అంతా ‘సైరా’ టీజర్ పై పెడుతూ విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉండే విధంగా ఈ టీజర్ ను రూపొందించడానికి చిరంజీవి క్షణం తీరిక లేకుండా ప్రస్తుతం ఈసినిమా టీజర్ పై పనిచేస్తున్న టీమ్ కు సూచనలు ఇస్తూ ‘సాహో’ టీజర్ కన్నా ‘సైరా’ టీజర్ అద్భుతం అని అనిపించే విధంగా రూపొందించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనితో ‘సాహో’ ‘సైరా’ టీజర్ల మధ్య జరుగుతున్న పోటీలో ఎవరు విజేత అన్న విషయం చిరంజీవి పుట్టినరోజునాడు తేలిపోతుంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: