ఎన్నో అంచనాల మధ్య రిలీజైన ఎన్టీఆర్ బయోపిక్ సినిమా ఆశించిన స్థాయి విజయం సాధించలేదు.  నిర్మాతగా మారి సినిమా తీస్తే.. పాపం బాలకృష్ణకు చేతులు కాలాయి.  చాలా నష్టం వచ్చినట్టు తెలుస్తోంది.  తన సినిమాలు తన నిర్మాణ సంస్థలోనే చేయాలి అనుకున్నా..ఆ నిర్ణయాన్ని మార్చుకున్నాడు. 

బోయపాటితో సినిమా అనుకున్నా.. బడ్జెట్ కారణంగా దానిని పక్కన పెట్టి సీనియర్ దర్శకుడు కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో సినిమాను షురూ చేశారు.  ఈ మూవీ ఇటీవలే లాంఛనంగా ప్రారంభం అయ్యింది.  ముందుగా అనుకున్న కథకు తిరిగి రిపేర్లు చేయడంతో ఆలస్యం అయ్యింది.  


త్వరలోనే రెగ్యులర్ షూట్ స్టార్ట్ కాబోతున్నది.  ఎలాగో ఎన్నికలు ముగిశాయి .  ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి పెద్దగా పనులు ఉండవు.  అందుకే సినిమాపై దృష్టి పెట్టారు.  బాలకృష్ణ 105 వ సినిమాకు అనేక పేర్లు అనుకున్నా ఫైనల్ గా క్రాంతి అనే టైటిల్ ను ఫిక్స్ చేశారని తెలుస్తోంది.  


టైటిల్ చూస్తుంటే పాత టైటిల్ లానే అనిపిస్తోంది.  ఇప్పటి తరానికి ఇలాంటి పేర్లు పెద్దగా నచ్చవు.  అందులోను బాలకృష్ణ లాంటి మాస్ హీరోకు ఇలాంటి పేర్లు పెద్దగా కలిసి రావు.  సి కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ చేయాలని ఫిక్స్ చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: