సైరా సినిమా షూటింగ్ అయిపోవడంతో చిరు కొరటాల సినిమాకు సన్నద్ధం అవుతున్నారు. అయితే మొదట సైరా చిత్రీకరణలో ఉన్న సమయంలోనే కొరటాల కూడా సినిమాను మొదలు పెట్టాలనుకున్నాడు. కాని చిరంజీవి వయసు రీత్యా రెండు సినిమాలను ఒకేసారి చేయడం వల్ల ఒత్తిడికి గురవ్వాల్సి వస్తుందనే ఉద్దేశ్యంతో రెండు చిత్రాలకు నిర్మాత అయిన రామ్ చరణ్ ఈ చిత్రాన్ని కాస్త హోల్డ్ లో పెట్టాడు.


కొరటాల శివను ఒప్పించి రామ్ చరణ్ వెయిటింగ్ లో పెట్టాడు.భరత్ అనే నేను విడుదలైన దాదాపు సంవత్సరంనరకు కొరటాల మూవీని మొదలు పెట్టబోతున్నాడు. రంగస్థలం విలేజ్ సెట్ పక్కనే భారీ సెట్టింగ్స్ ను చిరు 152వ చిత్రం కోసం వేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రాన్ని రామ్ చరణ్ తో పాటు కొరటాల శివ సన్నిహితుడు నిర్మించబోతున్నాడు. స్క్రిప్ట్ వర్క్ తో పాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్ దాదాపుగా పూర్తి అయిన నేపథ్యంలో సినిమాను ఎక్కువ ఆలస్యం లేకుండా విడుదల చేసే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.


సినిమాను ఆగస్టు నెల నుండి సెట్స్ పైకి తీసుకు వెళ్లే ఆలోచనలో ఉన్నారు. ఈలోపు చిరంజీవి మరింత బరువు తగ్గనున్నట్లుగా తెలుస్తోంది. కొరటాల శివ ఇప్పటి వరకు తీసిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఈ చిత్రం కూడా తప్పకుండా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది. అయితే చిరు సినిమాతో తరువాత కొరటాల ఎన్టీఆర్ తో సినిమా దాదాపుగా ఫిక్స్ అని తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: