చిరంజీవి తమ్ముడిగా సినిమా రంగంలో ప్రవేశించి, నటుడిగా ఎదిగారు నాగబాబు.క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి పాత్రలు చేసారు. వెండితెర మీదే కాదు ఇటు బుల్లితెర మీద కూడా నటిస్తున్నాడు. ఇటీవల నాగబాబు అనగానే టక్కున గుర్తొచ్చేది "జబర్దస్త్". ఈ షో ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ షోకి మొదట్నుండి జడ్జిగా వ్యవహరిస్తున్నారు.  తమ్ముడు పవన్ కళ్యాణ్ స్థాపించిన "జనసేన" పార్టీలో చేరి నర్సాపురం లోక్ సభ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు.

 

నాగబాబు పలు సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. రామ్ చరణ్ హీరోగా  నటించిన "ఆరెంజ్ సినిమాకి నాగబాబే నిర్మాత. అయితే ఈ సినిమా అనుకున్నంత విజయం సాధించలేదు. దాంతో నిర్మాత నాగబాబు అప్పుల్లో చిక్కుకుపోయాడు. అయితే తాజాగా వీటన్నింటి గురించి స్పందిస్తూ ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ  విధంగా అన్నాడు.

 

డబ్బు కంటే మానవత్వం, వ్యక్తిత్వం చాలా గొప్పవని అందరూ అంటుంటారని, నిజానికి వాటన్నింటికంటే డబ్బే  ముఖ్యమని అన్నారు. జీవితంలో డబ్బు చాలా ముఖ్యమని, దానిని సద్వినియోగం చేసుకోగలిగితే ఎంతో ఉపయోగం ఉంటుందన్నారు. అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానంగా ఆయనీ వ్యాఖ్యలు చేశారు.డబ్బుల్లేక తాను చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని, 49 ఏళ్ల వయసులో దాని విలువ బాగా తెలిసొచ్చిందని నాగబాబు పేర్కొన్నారు.

 

తాను డబ్బులను దుర్వినియోగం చేయలేదని అయితే, డబ్బు సంపాదించాలన్న కసి మాత్రం తనలో పెరిగిందని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత చాలా డబ్బు సంపాదించానని, మీరు కూడా ఉద్యోగంలో చేరినప్పటి నుంచే డబ్బు సంపాదించాలని సూచించారు. ఈ సందర్భంగా  ‘ది రిచ్చెస్ట్‌ మ్యాన్‌ ఇన్‌ బాబిలాన్‌’ అనే పుస్తకం చదవాలని అభిమానులకు సూచించారు. ఇది చదివితే డబ్బు ఎందుకు సంపాదించాలి? అది ఎలా ఉపయోగపడుతుంది? అన్న విషయాలు తెలుస్తాయని అన్నారు. ఎవరి దగ్గర ఎక్కువ డబ్బు ఉంటే వారే బలవంతులని నాగబాబు పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: