ప్రజావేదిక కూల్చివేత పై ఇప్పటికే టీడీపీ శ్రేణులు స్పందించి ఎంతో వితండవాదం చేశారు. అయితే ఆరు రోజుల పాటు యూరప్ పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఈ రోజు హైదరాబాద్ చేరుకున్న సంగతి తెలిసిందే. తాను దేశంలో లేనప్పుడుచోటు చేసుకున్న పరిణామాలపై పార్టీ నేతలు బాబుకు విన్నవించారు. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ తీసుకుంటున్ననిర్ణయాల మీద చర్చ జరిగింది.


రాష్ట్రంలో టీడీపీ శ్రేణుల మీద దాడుల గురించి నేతలు బాబు వద్ద ప్రస్తావించారు.  ప్రజావేదికను కూల్చివేయాలని జగన్ ఆదేశించిన అంశం వారి మధ్య ప్రధాన చర్చగా మారింది. ఈ సందర్భంగా చంద్రబాబు పాత విషయాల్ని గుర్తు చేశారు. ప్రజా వేదిక కూల్చివేత ఆలోచన సరైనది కాదని బాబు అభిప్రాయపడ్డారు.దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాల్ని ప్రతి ఊర్లో ఏర్పాటు చేశారని.. వీటి ఏర్పాటు కోసం అనుమతి తీసుకోలేదని గుర్తు చేశారు.


వైఎస్ విగ్రహాల్ని ఏర్పాటు చేసిన ప్రదేశాలన్ని అనుమతులు లేకుండా చేసినవని.. అలాంటప్పుడు వాటి సంగతేమిటి? అని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ప్రజావేదిక కూల్చివేతపై జగన్ నిర్ణయం తొందరపాటుగా బాబు అభివర్ణించారు. తాజాగా వైఎస్ విగ్రహాల విషయం తెర మీదకు వచ్చిన వేళ.. జగన్ ఈ అంశంపై ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: