సినిమాకి మైలేజి తీసుకురావడానికి దర్శక నిర్మాతలు  చాలా రకాలుగా ప్రయత్నిస్తుంటారు. మైలేజి కోసం పెద్ద పెద్ద స్టార్లని తీసుకుంటారు. ఐటెం సాంగ్స్ పెడతారు. అలాగే ఒక తెలుగు నిర్మాత తను తీయబోయే సినిమా కోసం సన్నీ లియోని ని ఒక పాత్ర చేయిద్దామనుకున్నాడట. తాను రూపొందించబోయే కొత్త సినిమాలో సన్నీలియోన్ తో ఓ రోల్ చేయించాలని భావించిన సదరు నిర్మాత ఆమెను సంప్రదించారట. అయితే.. నటిస్తా గానీ నావి కొన్ని కండీషన్స్.. అని పేర్కొంటూ ఆ నిర్మాతకు దిమ్మతిరిగే కండీషన్స్ పెట్టిందట సన్నీ.

 

దీంతో ఆ కండిషన్స్ చూసి మైండ్ బ్లాంక్ అయిన ఆ నిర్మాత సైలెంట్ గా వెనక్కి వచ్చేశాడని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ టాపిక్ ఫిలింనగర్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్ అవుతోంది.పోర్న్ స్టార్‌గా అశేష పాపులారిటీ సంపాదించిన సన్నీలియోన్.. ఆ తర్వాత పోర్న్ సినిమాలు వదిలేసి వెండితెర బాట పట్టింది. ఆమె అందానికి ఫిదా అయిన బాలీవుడ్ ఇండస్ట్రీ ఆమెకు వరుస అవకాశాలు ఇచ్చింది. అలా అలా టాలీవుడ్ వైపు చూసిన ఈ సెక్సీ స్టార్ మంచు మనోజ్ హీరోగా నటించిన 'కరెంట్ తీగ' లో నటించి మెప్పించింది.

 

ఆ తర్వాత రాజశేఖర్ హీరోగా నటించిన 'గరుడ వేగ' సినిమాలో డియ్యో డియ్యో అంటూ ఐటెం సాంగ్ కే కొత్త వన్నె తెస్తూ ప్రేక్షకులను ఫుల్లుగా ఎంటర్‌టైన్ చేసింది. దీంతో సన్నీకి తెలుగులోనూ మంచి డిమాండ్ ఏర్పడింది. ఈ మేరకు ఆమె డేట్స్ కోసం దర్శకనిర్మాతలు వెయిట్ చేస్తున్నారు.ఈ నేపథ్యంలో రీసెంట్‌గా సన్నీలియోన్‌ను సంప్రదించిన ఓ నిర్మాత పట్టపగలే చుక్కలు చూశాడట. సన్నీలియోన్ పెట్టిన కండీషన్స్ తో ఆయనకు ముచ్చెమటలు పట్టాయట.

 

తాను ఏదైనా సినిమాకి సంతకం చేయాలి అంటే ముందుగా సదరు దర్శకనిర్మాతలు బౌండెడ్ స్క్రిప్ట్‌తో రావాలని ఆమె చెప్పడంతో షాకయ్యాడట సదరు నిర్మాత. అంతేకాదు సెట్స్‌పై దర్శకనిర్మాతలు క్రమశిక్షణతో మెలగాలి అంటూ పెద్ద కండీషన్ పెట్టిందట సన్నీ. ఈ విషయం బయటకు రావడంతో స్టార్ హీరోయిన్సే నోరెళ్ల బెడుతున్నారట.


మరింత సమాచారం తెలుసుకోండి: