పూజా హెగ్డే అందాల పూబంతి. తెలుగులో అతి తక్కువ టైంలో స్టార్ డమ్ తెచ్చుకున్న హీరోయిన్. పూజా ఇపుడు టాప్ స్టార్స్ ఫస్ట్ చాయిస్. అందం, అభినయం నిండుగా ఉన్న ఈ అమ్మడు తమ సినిమాల్లో కావాలని అంతా కోరుకుంటున్నారు.


అయితే పూజా చూపు మాత్రం అక్కడ ఉందిట.  తెలుగు చిత్ర సీమలో ఇప్పుడు తనకున్న పాపులారిటీని ఖాతరు చేయకుండా బాలీవుడ్‌ అవకాశాల కోసం చూస్తోంది పూజా హెగ్డే. హిందీలో ఒక మల్టిపుల్‌ సినిమా డీల్‌ ఒప్పుకుని ఇక్కడ కొన్ని పెద్ద సినిమాలు మిస్‌ అయ్యే పరిస్థితిని కొని తెచ్చుకుంది.


అసలే టాలీవుడ్లో కొత్త అందాలు వచ్చేశాయి. రష్మిక వూపు అలా ఇలా లేదు. ఈ చిన్నది మహేష్ బాబు పక్కన చాన్స్ కొట్టేసింది. బనీ తో నెక్స్ట్ మూవీ అంటోంది. ఇక కీర్తి సురేష్ కూడా రెడీ అంటోంది. మరింతమంది కొత్త వారు సై అంటున్నారు. ఈ టైంలో టాలీవుడ్లో టాప్ రేంజిలో ఉన్న పూజా తప్పు చేస్తోందని అంతా అంటున్నారు. బాలీవుడ్లో మూవీ ఫట్ అయితే మళ్ళీ అవకాశాలు ఇవ్వడానికి టాలీవుడ్ ఖాళీగా ఉండదని క్లారిటీగా చెప్పేస్తున్నారు. మరి పూజా చాయిస్  డెసిషన్ చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: