తెలుగులో రీమేక్ స్పెషలిస్ట్ గా క్రేజ్ తెచ్చుకున్న డైరక్టర్ భీమనేని శ్రీనివాస్ ఇప్పుడు మరో సూపర్ హిట్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. కోలీవుడ్ లో హిట్టైన కణా సినిమాను తెలుగులో కౌసల్యా కృష్ణమూర్తిగా రీమేక్ చేస్తున్నారు. అయితే సినిమాలో హీరోయిన్ గా నటించిన ఐశ్వర్య రాజేష్ తెలుగు వర్షన్ లో కూడా నటిస్తుంది.


క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ లో కె.ఎస్ రామారావు నిర్మిస్తున్న ఈ సినిమా నుండి మొదటి సాంగ్ రిలీజైంది. తమిళ కణాలో సూపర్ హిట్ సాంగ్ అయిన ఒతాయాడి సాంగ్ తెలుగు వర్షన్ అదే ట్యూన్ తో రిలీజ్ చేశారు. ముద్దాబంతి పువ్వ అంటూ వచ్చే ఈ సాంగ్ ప్రేక్షకులను అలరిస్తుంది.


తమిళ వర్షన్ ఈ పాటకు సూపర్ క్రేజ్ ఏర్పడింది. ఒకటి రెండు కాదు ఏకంగా 67 మిలియన్ వ్యూస్ తో యూట్యూబ్ ను షేక్ చేసింది ఈ పాట. టిక్ టాక్ వీడియోస్ లో కూడా ఈ పాట చాలా ఫేమస్ అయ్యింది. తెలుగులో కూడా ఈ పాట సూపర్ హిట్ అయ్యేలా ఉంది. థామస్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా మ్యూజిక్ పరంగా అలరించేలా ఉంది. 


కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ ఈ సినిమాలో స్పెషల్ రోల్ చేస్తున్నారు. కార్తిక్ రాజు, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిశోర్, రంగస్థలం మహేష్ ఇలా చాలామంది ఈ సినిమాలో నటిస్తున్నారు. జూలై రెండో వారంలో రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా టీజర్ ఇప్పటికే ప్రేక్షకులను అలరిచింది. మరి ఐశ్వర్య రాజేష్ తొలి సినిమా తెలుగులో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: