ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగిన తరువాత బ్రహ్మానందం కొంత గ్యాప్ తీసుకుని లేటెస్ట్ గా నటిస్తున్న ఒక సినిమా టైటిల్ ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. బ్రహ్మీ సునీల్ సన్నిలియోన్ లను కలిపి దర్శకుడు తాతినేని ప్రసాద్ తెలుగు హిందీ భాషలలో ఒకేసారి నిర్మిస్తున్న ఒక మూవీకి సంబంధించిన వార్తలు ఇప్పుడు సంచలనంగా మారాయి. 

హారర్ కామెడీగా నిర్మాణం జరుపుకుంటున్న ఈమూవీ షూటింగ్ ఉత్తర ప్రదేశ్ లోని ఒక పురాతనమైన హవేలీలో జరుగుతున్నట్లు సమాచారం. ఈమూవీలో మరొక బ్యూటీగా సెక్సీ బాంబ్ మందన కరిమి నటిస్తోంది. ఒకేసారి తెలుగు హిందీ భాషలలో నిర్మాణం జరుపుకుంటున్న ఈమూవీని ఈ ఏడాది చివరిలోగా విడుదల చేస్తారని టాక్. 

ప్రేక్షకులను ప్రతి సీన్ లోను విరగబడి నవ్వుకునేలా చేసే ఈమూవీ కథకు స్క్రీన్ ప్లేను చాల వెరైటీగా వ్రాసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బ్రహ్మానందం సునీల్ ల మార్కెట్ పూర్తిగా పడిపోయిన నేపధ్యంలో సన్నిలియోన్ క్రేజ్ తో ఈమూవీని హిందీ తెలుగు భాషలలో మార్కెట్ చేయబోతున్నారు.  

గతంలో బ్రహ్మానందం బాలీవుడ్ సినిమాల వైపు వెళ్ళడానికి ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలు విజయవంతం కాలేదు. అయితే సునీల్ కు ఇదే తొలిసారి బాలీవుడ్ ఎంట్రీ. ఇలాంటి పరిస్థుతులలో ఈమూవీతో తమకు తిరిగి మంచి క్రేజ్ ఏర్పడుతుందనీ వీరిద్దరూ భావిస్తున్నారు. ఈ మధ్య కాలంలో అంచనాలు లేకుండా వచ్చిన సినిమాలు చాల వరకు విజయవంతం అవుతున్న పరిస్థుతులలో ఈ ప్రయోగానికి స్పందన ఎలా ఉంటుందో తెలియాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: