ఒక‌ప్పుడు ఇండియ‌న్ సినిమా అంటే బాలీవుడ్ సినిమాయే. దక్షిణాదిన నాలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లు స‌హా ఉత్త‌రాదిన ప‌లు చిత్ర ప‌రిశ్ర‌మ‌ల్లో రూపొందే సినిమాలు ఓ రేంజ్‌కే ప‌రిమిత‌మయ్యేవి. ఎంత మంచి కంటెంట్ ఉన్నా.. ప‌రిమిత‌మైన సంఖ్య‌లోని ఆడియ‌న్స్‌, మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకునే ప్రాంతీయ భాషా చిత్రాలు రూపొందేవి. ఇది బాలీవుడ్‌కు వ‌రంగా మారింది.

 

కానీ ఇప్పుడు పరిస్థితి మారింది.  బాలీవుడ్ త‌ర్వాత ఆ రేంజ్‌లో ఎక్కువ సంఖ్య‌లో సినిమాలను నిర్మించే ప‌రిశ్ర‌మ టాలీవుడ్ మాత్ర‌మే. అయినా కూడా తెలుగు సినిమాల‌కు దేశ వ్యాప్తంగా ఆద‌ర‌ణ త‌క్కువ‌గానే ఉండేది. మార్కెట్ పరిమిత స్థాయిలోనే ఉండేది. కానీ `బాహుబ‌లి` సినిమా తెలుగు సినిమా రేంజ్‌ను మార్చేసింది. ఒక బాలీవుడ్‌కే కాదు.. ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు సినిమా రేంజ్ ఒక్క‌సారిగా హిమాల‌య శిఖ‌రాగ్రాన్ని అందుకుంది.

 

అసలు కథ ఇక్కడే మొదలైంది.. తెలుగు సినిమా క‌థ‌, పాత్ర‌ల వంటి వైవిధ్యాంశాల‌కు ప్రాధాన్య‌త పెరుగుతున్న త‌రుణంలో వైవిధ్య‌మైన ప్రేమ క‌థాంశంగా రూపొందిన చిత్రమే `అర్జున్ రెడ్డి`. క‌థానాయ‌కుడిగా `అర్జున్ రెడ్డి`లో న‌టించారు. సందీప్ రెడ్డి వంగా అనే డెబ్యూ డైరెక్ట‌ర్ తెరకెక్కించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో తిరుగులేని విజ‌యాన్ని సాధించింది. విజ‌య్ దేవ‌ర‌కొండను స్టార్ హీరోగా మారిపోయారు.

 

బాలీవుడ్ క్రిటిక్స్‌కు `క‌బీర్ సింగ్‌` చిత్రంలో విమ‌ర్శ‌నాత్మ‌కంగా ఉండే అంశాలేంటి? అని ఆలోచిస్తే.. సినిమాలో లిప్‌లాక్స్‌.. బూతులు అని అనుకుందాం.  కానీ లిప్‌లాక్ సీన్స్ బాలీవుడ్‌లో కొత్తేం కాదు.. బాహుబ‌లి త‌ర్వాత ఇండియ‌న్ సినిమా అంటే బాలీవుడ్ సినిమా మాత్ర‌మే అనే ఆలోచ‌న‌కు ఫుల్‌స్టాప్‌ ప‌డింది. బాలీవుడ్ చిత్రాల‌ను త‌ల‌ద‌న్నేలా `బాహుబ‌లి` క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి. అలాగే అన్నీ ప్రాంతీయ భాషా చిత్రాల‌కు గుర్తింపు ల‌భించడం ఎక్కువైంది. ఇది బాలీవుడ్ సినీ వ‌ర్గాల్లో కొంద‌రికి మింగుడుపడటంలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: