నందమూరి బాలక్రిష్ణ ఏ గెటప్ వేసినా సూటయిపోతారు. ఈ మధ్య రాజకీయాల్లో బిజీగా ఉండి, సినిమాలు చేయలేదు. మొన్న జరిగిన ఎన్నికల్లో హిందూపురం నుండి పోటీ చేసి ఎమ్మెల్యే గా గెలిచి రాజకీయాల్లోనూ కింగే అని నిరూపించుకున్నారు.  తండ్రికి తగ్గ వారసుడిగా సినీ, రాజకీయ వర్గాల్లో రాణిస్తున్న బాలకృష్ణ గతంలో చాల సినిమాల్లో గన్ పట్టుకొని ఆడియన్స్ చేత ఈలల గోల పెట్టించారు. ఇప్పుడు మరోసారి దాన్నే రిపీట్ చేసేందుకు రెడీ అవుతున్నారట బాలయ్య బాబు.

 

రాజకీయాల్లో బిజీగా ఉన్న బాలక్రిష్ణ ఈ మధ్య కొద్దిగా బిజీ నుండి రిలాక్స్ అవుతున్నారట.ఈ మేరకు తన తదుపరి సినిమాలో నటించేందుకు రెడీ అయ్యారు. ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత బాలకృష్ణ 105వ సినిమా సెట్స్ పైకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు బాలకృష్ణ. తమిళ డైరెక్టర్ కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో బాలకృష్ణ 105 రూపొందనుంది. ఈ చిత్రానికి బడా నిర్మాత సి కళ్యాణ్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఇటీవలే పూజా కార్యక్రమాలు ఫినిష్ చేసుకున్న ఈ సినిమా అతిత్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.

 

ఈ నేపథ్యంలో ఇందులో బాలయ్య క్యారెక్టర్ ఏంటనే దానిపై ఓ ఆసక్తికర వార్త తెరపైకి వచ్చింది.బాలకృష్ణ కెరీర్ లో 105 వ సినిమాగా రాబోతున్న ఈ ప్రతిష్టాత్మకమైన చిత్రంలో బాల‌య్య పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌తో పాటు గ్యాంగ్ స్ట‌ర్‌గా కూడా కనిపించనున్నాడని తెలుస్తోంది. ముందు పోలీస్ ఆఫీసర్‌గా చేతిలో గన్ను పట్టుకొని గడగడలాడించిన బాలయ్య ఆ తర్వాత గ్యాంగ్‌స్టర్‌గా ఎందుకు మారాడన్నదే ఈ సినిమాలో ఆసక్తికర అంశమని తెలుస్తోంది.

 

ఇక ఈ సినిమా టైటిల్ విషయానికొస్తే.. ఇందులో ఆయన క్యారెక్టరైజేషన్ పరంగా రూలర్ అనే టైటిల్ ఫిక్స్ చేయాలని భాస్తున్నారట. మరోవైపు 'క్రాంతి' అనే టైటిల్‌ వైపు బాలకృష్ణ మొగ్గుచూపుతున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. ఈ సినిమా లోని హీరోయిన్స్ విషయంలో ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. అతి త్వరలో చిత్రానికి సంబందించిన అన్ని వివరాలు ప్రకటించనుంది చిత్ర యూనిట్. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళనుండడంతో నందమూరి అభిమానుల్లో ఉత్సాహం ఉప్పొంగింది.


మరింత సమాచారం తెలుసుకోండి: