ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ సాహో. కొద్దిరోజుల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా టీజర్, త్వరలో విడుదల కాబోయే సినిమాపై అంచనాలు తారస్థాయికి తీసుకెళ్లింది అనే చెప్పాలి.  టాలీవుడ్ తో పాటు కొందరు హాలీవుడ్ టెక్నీషియన్లు కూడా పని చేసిన ఈ భారీ బడ్జెట్ మూవీని యువి క్రియేషన్స్ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. 

ఇక ఈ సినిమా హక్కుల కోసం దాదాపుగా అన్ని ఏరియాల నుండి భారీ ఆఫర్లు వస్తున్నట్లు సమాచారం. ఇకపోతే తెలుగు సినిమాకు కలెక్షన్ల అడ్డా అయిన నైజాం ఏరియాలో సాహో కి బిజినెస్ ఊహించని స్థాయిలో జరుగబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఓవర్సీస్ హక్కులు భారీ స్థాయిలో అమ్ముడుపోగా, నైజాంలో కూడా ఒక బడా నిర్మాత ఈ సినిమా హక్కులను దక్కించుకునేందుకు సిద్ధమయినట్లు చెప్తున్నారు. ఇక నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం సాహో నైజాం లో భారీ లెవెల్లో విడుదల ప్లాన్ చేసారని, 

ఇక ఈ సినిమా అనుకున్న విధంగా సక్సెస్ అయి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంటే మాత్రం నైజాం ఏరియాలో బాహుబలి 1 ని సునాయాసంగా దాటేసి ముందుకు వెళ్తుందని, అదే ఊపుకనుక మరికొన్నాళ్లు కొనసాగించగలిగితే అక్కడ బాహుబలి2 రికార్డును కూడా అందుకునే అవకాశం ఉందని అంటున్నారు. విడుదలకు ముందే ఇన్ని రికార్డులు సృష్టిస్తున్న సాహో సినిమా, రేపు విడుదల తరువాత ఇంకెన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: