లక్ష్మీ కళ్యాణం సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది "కాజల్". ఆ సినిమా పెద్దగా ఆడకపోయినప్పటికీ ఆమెకు అవకాశాలు బాగానే వచ్చాయి. చందమామ సినిమాతో  ఇండస్ట్రీలో స్థానాన్ని కన్ఫర్మ్ చేసుకుని, మగధీర సినిమాతో మరల వెనుకకు తిరిగి చూసుకోలేదు.ఆ అందాల నటి కెరియర్ స్టార్ట్ అయి పదిహేను సంవత్సరాలు అవుతుంది. అయినప్పటికీ ఆమె అందం చెక్కు చెదరలేదు. ఇండస్ట్రీలో ఇంత సుదీర్ఘ కెరియర్ ఉన్న కాజల్ గురించి మనకు తెలియని కొన్ని విషయాలు .

 

కాజల్ కి సోషల్‌మీడియాలో విపరీతమైన ఫాలోవర్స్‌ ఉన్నారు. ఇటీవల ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్ల సంఖ్య 11 మిలియన్లకు చేరింది. ఫేస్ బుక్ లో కూడా  రెండు కోట్లకి పైగానే ఫాలోవర్స్ ఉన్నారు.కాజల్‌కు పుస్తకాలు చదవడమంటే బాగా ఇష్టం. ‘జర్నీ హోమ్‌’, ‘ఔట్‌ ఆఫ్‌ అవర్‌ మైండ్స్‌’, ‘బిఫోర్‌ వి విజిట్‌ ది గాడెస్‌’, ‘ది ఆర్ట్‌ ఆఫ్‌ ది గుడ్‌లైఫ్‌’ తదితర పుస్తకాల్ని చదివారు. అంతేకాదు కాజల్‌ తరచూ నెటిజన్లకు ‘మంచి మాటలు’ చెబుతూ పోస్ట్‌లు కూడా చేస్తుంటారు.

 

కాజల్‌ అనగానే ముందుగా గుర్తొచ్చేది ఆమె రూపం. వయసు పెరుగుతున్న కొద్దీ దేహాన్ని నాజూగ్గా ఉంచుకోవడం అంత సులభమైన పనికాదు. అందుకే కాజల్‌ ఫిట్‌నెస్‌ను తన జీవితంలో భాగం చేసుకుంది. ఇప్పటికే పలుమార్లు ఫిట్‌నెస్‌ వీడియోలను ఆమె షేర్‌ చేసింది. ఇంకా ఫిట్‌గా తయారు కావడానికి ఈ ఏడాది మేలో ఆమె 100 రోజుల ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌ను స్వీకరించి, వర్కవుట్లు చేస్తున్నారు.

 

వరుస సినిమాలతో కాజల్‌ బిజీగా ఉన్నప్పటికీ అప్పుడప్పుడూ తనచేతితో వంటలు చేస్తుంటారు. వంటింట్లోకి వెళ్లి కేక్‌లు, కుకీస్‌ చేస్తుంటారు. అంతేకాదు ఈ సందర్భంగా తీసిన ఫొటోలను కూడా ఆమె పలు సందర్భాల్లో షేర్‌ చేశారు, ఎలా తయారు చేయాలో కూడా చెప్పారు.కాజల్‌ తరచూ విహారయాత్రలకు వెళ్తుంటారు. ఇటీవల పుట్టినరోజు సందర్భంగా ఆమె తన కుటుంబంతో కలిసి దుబాయ్‌ వెళ్లారు.కాజల్‌లో జంతు ప్రేమికురాలు కూడా ఉన్నారు. ఆమె జంతువుల్ని హింసించడానికి వ్యతిరేకంగా ‘పెటా’ తరఫున పనిచేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: