హాలీవుడ్ సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమలకి మంచి ఆదరణ ఉంది. ఈ సినిమాల్లోని కథలు విభిన్నంగా ఉండి, ప్రేక్షకుడిని ఒక కొత్త లోకంలోకి తీసుకెళ్తాయి. విజువల్ ఎఫెక్ట్స్ ఉన్న సినిమాలకి ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఈ సినిమా నిర్మాణ సంస్థలు సైతం  విదేశాల మార్కెట్లను కొల్లగొట్టడానికి కొత్త కొత్త స్ట్రాటజీలను ఎంచుకుంటున్నాయి. ఈ సినిమాలను ప్రాంతీయ భాషల్లో డబ్బింగ్ చెప్పించి మరీ విడుదల చేస్తున్నారు.

 

అవతార్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కలెక్షన్లు సాధించిందో అందరికీ తెలిసిందే. జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కలెక్షన్లలో రికార్డులు సృష్టించింది. ఒక సినిమా ఇన్ని వేల కోట్లు సాధించడం నిజంగా ఆశ్చర్యానికి గురి చేసింది. మొన్న వచ్చిన అవెంజర్స్ కూడా బాక్సాఫీసు వద్ద రికార్డు సృష్టించింది. ఇప్పుడు మరో సినిమా రెడీ అవుతోంది. మార్వెల్ స్టూడియో నుండి వస్తున్న స్పైడర్ మ్యాన్ వచ్చే నెల 5 వ తేదీన్ రిలీజ్ కానుంది.

 

ప్రముఖ హాలీవుడ్‌ నటుడు టామ్‌ హోలాండ్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘స్పైడర్ మ్యాన్‌: ఫార్‌ ఫ్రం హోం’ సినిమా ప్రపంచవ్యాప్తంగా కంటే ముందు మనదేశంలో విడుదల కాబోతోంది. ఈ సినిమా జులై 4న భారత్‌లో విడుదల అవుతుంది. జులై 5న మిగిలిన దేశాల్లో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ విషయాన్ని సోనీ పిక్చర్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ట్విటర్‌ వేదికగా ప్రకటించింది.

 

తెలుగు, తమిళం, ఇంగ్లీష్‌, హిందీ భాషల్లో సినిమా విడుదల అవుతుంది. విడుదల తేదీలో మార్పులు జరగడంపై భారత్‌కు చెందిన సోనీ పిక్చర్స్‌ ఎండీ వివేక్‌ స్పందించారు. ‘భారత ప్రజలను ఎక్కువగా ఆకట్టుకునే సూపర్‌ హీరో స్పైడర్‌మ్యాన్‌. అదీకాకుండా ‘స్పైడర్‌మ్యాన్‌: ఫార్‌ ఫ్రం హోం’ సినిమాకు విపరీతమైన క్రేజ్‌ ఉంది. అందుకే ఒక రోజు ముందే భారత్‌లో విడుదల చేయాలనుకుంటున్నాం. ఆదివారం నుంచి అడ్వాన్స్‌డ్‌ బుకింగ్స్‌ ప్రారంభం అవుతాయి’ అని వెల్లడించారు. ‘అవెంజర్స్‌: ఎండ్‌గేమ్‌’లో ఐరన్‌ మ్యాన్‌ చనిపోతాడు. దాంతో అతని బాధ్యతలు స్పైడర్‌మ్యాన్‌పై పడతాయి. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నదే సినిమా కథ.


మరింత సమాచారం తెలుసుకోండి: