కన్ను కొట్టి ఓవర్ నైట్ లోనే దేశంలోనే పాపులర్ హీరోయిన్ అయిపోయింది ప్రియా ప్రకాష్ వారియర్. బయటకు వచ్చిన వీడియో ఎంత పాపులర్ అయిందో ప్రియా ప్రకాష్ వారియర్ కి అలాగే ఆఫర్లు కూడా వచ్చాయి. అప్పట్లో ఆ వీడియో చూసిన చాలా మంది బాలీవుడ్ ఇండస్ట్రీ లో ఉన్న పెద్ద పెద్ద దర్శకులు సైతం ప్రియా ప్రకాష్ వారియర్ తో సినిమా చేయటానికి రెడీ అయ్యారు కారణం ఆమె ఇచ్చిన ఎక్సప్రెషన్.


అయితే ఆమె నటించిన మొదటి సినిమా దారుణంగా ఫ్లాప్ అవడంతో వచ్చిన అవకాశాలు అన్ని వెనక్కి వెళ్లి పోయాయి. అయితే తాజాగా ఇప్పుడు నితిన్ సినిమాలో ఈ ముద్దుగుమ్మ కి ఒక ఛాన్స్ వచ్చింది. దీంతో నిత్యం సినిమాతో తెలుగులో ఆమెకి మరిన్ని మంచి అవకాశాలు వస్తాయని భావించింది. కానీ ప్రియా వారియర్ కి అంత సీన్ లేదని టాక్. నితిన్ సినిమాలో ప్రియా క్యారెక్టర్ తెరపై కనిపించేది కేవలం ఇరవై నిమిషాలేనట. ఎందుకంటే ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుందట.


రెండో హీరోయిన్ గా మాత్రమే ప్రియా ప్రకాష్ వారియర్ ని తీసుకున్నట్లు ఆమె పాత్ర కూడా చిన్నదేనని ఫిలింనగర్ టాక్. కాకపోతే తెరపై కనిపించనంతసేపు ఆమె నటన ఆకట్టుకుంటుందట. ఈ సినిమాని డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వం చేస్తున్నారు. ఆయన దర్శకత్వం చేసిన సినిమాల్లో ఉన్న పాత్రలన్నింటికీ మంచి ప్రాధాన్యత ఉంటుంది..ఇటువంటి నేపథ్యంలో చిన్న పాత్ర అయినా ప్రియా ప్రకాష్ వారియర్ ఒప్పుకుంది అంటే కచ్చితంగా ఆ పాత్ర సినిమాకి హైలెట్ అయ్యి ఉండొచ్చు అని ఫిలిం క్రిటిక్స్ కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ సినిమాతోనైనా ప్రియావారియర్ కి హిట్టు పడుతుందో లేదో చూడాలి.  



మరింత సమాచారం తెలుసుకోండి: