కరిష్మా కపూర్ ఒకప్పుడు హాట్ హీరోయిన్ గా బాలీవుడ్ ను ఒక ఊపు ఊపింది. అయినా ఇప్పటికి బికినీలో కుర్రకారును రెచ్చగొడుతుంది. దాదాపుగా టాప్ హీరోస్ అందరితో ఎన్నో బ్లాక్ బస్టర్  సినిమాల్లోనటించి బాలీవుడ్ లో తన సత్తా చాటింది. 'జిగర్'.. 'రాజా హిందుస్తాని'.. 'దిల్ తో పాగల్ హై'.. 'హీరో నెం.1'.. 'కూలీ నెం. 1'..'బీవి నెం. 1'.. ఇలా చెప్పుకుంటూ పోతే ఆమె లిస్టులో చాలా హిట్ సినిమాలు ఉన్నాయి.  సరే.. ఇప్పుడు ఇంత లెంగ్తీ ఇంట్రో ఎందుకు వచ్చిందంటే.. ఈరోజు కరిష్మా కపూర్ 45 వ పుట్టిన రోజు.


అయితే ఎంత సీనియర్ బ్యూటీ అయినా కరిష్మా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.  రెగ్యులర్ గా అప్డేట్స్ ఇస్తూ.. గ్లామరస్ ఫోటోలు పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ తో నిత్యం టచ్ లో ఉంటుంది. ఈ పుట్టినరోజు సందర్భంగా కరిష్మా తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక బికిని ఫోటో పోస్ట్ చేసి 'ఏ వయసులోనైనా మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి' అనే సందేశాన్ని ఇచ్చింది.  ఈ ఫోటోలో కరిష్మా ఓ అందమైన బ్లాక్ బికినీ ధరించి ఒక బీచ్ రిసార్టులోని స్విమ్మింగ్ పూల్ దగ్గర పడుకొని ఆకాశంలోకి చూస్తూ ఒక కిరాక్ పోజిచ్చింది. 


  కరిష్మా అని చెప్పకుండా.. వయసు నలభై ఐదు అని చెప్పకుండా.. ఎవరికైనా ఈ ఫోటో చూపించి 'ఈ బికిని పాప వయసెంత?' అని అడిగితే ఎవరు కూడా అసలు వయసును గెస్ చేయలేరు!ఈ ఫోటోకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.  "మై చైల్డ్ హుడ్ క్రష్".. "అంత ఫిట్నెస్.. ఎలా ఎలా?".. "లోలో ఈజ్ సూపర్ హాట్" అంటూ కామెంట్లు పెట్టారు.  లాస్ట్ కామెంట్ లో లోలో ఏంటో తెలుసా?  కరిష్మా ముద్దు పేరు లోలో.  

మరింత సమాచారం తెలుసుకోండి: