ఈరోజుతో ‘మహర్షి’ 50 రోజుల పండుగ జరుపుకుంటున్న నేపధ్యంలో ఈ సాయంత్రం జరగబోతున్న ‘మహర్షి’ 50 రోజుల ఫంక్షన్ కోసం అభిమానులు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. ఈ ఫంక్షన్ హడావిడి పూర్తి అయిన తరువాత కొద్ది గ్యాప్ తో నహేష్ తన ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీని కాశ్మీర్ లో జూలై మొదటి వారం నుండి మొదలుపెట్టబోతున్నాడు. 

అనీల్ రావిపూడి దర్శకత్వంలో ప్రారంభం కాబోతున్న ఈమూవీ రాబోతున్న సంక్రాంతికి రికార్డులు క్రియేట్ చేస్తుంది అని మహేష్ అభిమానులు భావిస్తూ ఉన్నా లోలోపల మటుకు ఈమూవీ విషయమై ఒక భయం వారిని వెంటాడుతున్నట్లు టాక్. ప్రస్తుతం వారి భయం అంతా క్రేజీ హీరోయిన్ రష్మిక ఎంపిక మీదే ఉందని అంటున్నారు. ప్రిన్స్ అభిమానులలోని కొందరు అభిప్రాయం ప్రకారం మహేష్ రష్మికల జోడీ బాగుండదు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

మహేష్ పక్కన జోడి అంటే అందరు హీరోయిన్స్ సరిపోరనీ అంటూ గ్లామర్ లో మహేష్ తో సరిసమానంగా సరితూగగల స్థాయి రష్మికకు లేదు అంటూ ఒక అభిప్రాయాన్ని మహేష్ అభిమానులు స్పష్టంగా సూచిస్తునారు. మహేష్ మొదటి సినిమా ‘రాజకుమాఉడు’ నుండి లేటెస్ట్ గా వచ్చిన ‘మహర్షి’ వరకు మహేష్ తో నటించిన హీరోయిన్స్ అంతా గ్లామర్ విషయంలో సరితూగుతారని ఆ రేంజ్ స్థాయి రష్మికకు ఉందా అంటూ మహేష్ అభిమానులు సందేహాలు వ్యక్తపరుస్తున్నారు. 

గతంలో ఈమూవీకి హీరోయిన్ గా సాయి పల్లవి పేరు ఖరారు అవుతుంది అన్నప్పుడు మహేష్ అభిమానులు ఎంత భయపడ్డారో ఇప్పుడు రష్మిక విషయంలో కూడ అదే స్థాయిలో భయపడటం లేటెస్ట్ ట్విస్ట్. ‘స్పైడర్’ లో కాస్త మేకప్ తగ్గినందుకే రకుల్ లాంటి బ్యూటీ మహేష్ ముందు తేలిపోయిన నేపద్యంలో చాల నేచురల్ గా ఉండే రష్మిక మహేష్ లుక్స్ ముందు నిలబడగలదా అన్నది అభిమానుల సందేహం. ఇప్పటికే ఈసినిమాకు సంబంధించి షూటింగ్ ప్రారంభం కాబోతున్న నేపధ్యంలో కొత్తగా మహేష్ అభిమానులు లేవనెత్తిన ఈ అంశాలు ఒక విధంగా రష్మికను కూడా ఖంగారు పెడతాయి అని అనడంలో ఎటువంటి సందేహం లేదు..



మరింత సమాచారం తెలుసుకోండి: