హీరో రాజశేఖర్ అస్వస్థతకు గురైనట్లువార్తలు వస్తున్నాయి. ఈకారణంగా ఈరోజు జరగవలసిన ‘కల్కి’ ప్రమోషన్ యాక్టివిటీలు క్యాన్సిల్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.  అదేవిధంగా  ఈ సాయంత్రం ‘కల్కి’ సినిమాకోసం  ఏర్పాటు చేయబడ్డ  ప్రీరిలీజ్ ఫంక్షన్ కూడ క్యాన్సిల్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.  

తెలుస్తున్న సమాచారం మేరకు నిన్నటి నుంచి రాజశేఖర్ జ్వరంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈరోజు కాస్త తగ్గిందని రేపటికి మళ్ళీ మామూలు స్థితికి వస్తాడని ‘కల్కి’ యూనిట్ వర్గాల నుండి లీకులు వస్తున్నాయి. ‘కల్కి’ సినిమాకు రాజశేఖర్ కాస్త ఎక్కువగా వర్క్ చేయడంతో అలసట వల్ల రాజశేఖర్ కు ఈ అస్వస్థ వచ్చింది అని అంటున్నారు. 

 ‘గరుడవేగా’ హిట్ అయిన తరువాత తిరిగి ట్రాక్ లోకి వచ్చిన రాజశేఖర్ ‘కల్కి’ మూవీ పై చాల ఆసలు పెట్టుకున్నాడు. దీనికి తగ్గట్టుగా ఈమూవీకి ప్రీ పాజిటివ్ రిలీజ్ టాక్  రావడంతో ఈమూవీకి మంచి ఓపెనింగ్స్ వచ్చే ఆస్కారం ఉంది. దీనికి తగ్గట్టుగానే ఈ మూవీని చాల గట్టిగా ప్రమోట్ చేస్తున్నారు.

ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో నిర్మింపబడ్డ ఈ మూవీకి సుమారు 20 కోట్ల బడ్జెట్ ఖర్చు కావడంతో చిన్న సినిమాగా మొదలైన ఈ మూవీ మిడిల్ రేంజ్ మూవీగా మారిపోయింది. ఇలాంటి పరిస్థుతులలో ఈ మూవీని సోలో రిలీజ్ గా కాకుండా ఆది సాయి కుమార్ నటించిన ‘బుర్ర కథ’ తో పోటీగా విడుదల అవుతున్న పరిస్థుతులలో ఈ వారం విజేత ఎవరూ అన్న విషయమై ఇండస్ట్రీ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: