హిందీలో కబీర్ సింగ్ సృష్టిస్తున్న సంచలనం అంత ఇంతా కాదు. కబీర్ సింగ్ మన తెలుగు అర్జున్ రెడ్డికి రీమేక్ అనేది తెలిసిందే. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, కంటెంట్ అదిరిపోవడంతో కలెక్షన్లు కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా స్టోరీ నెరేషన్ కి బాలీవుడ్ ఆశ్చర్యపోతోంది. దీంతో ఇప్పుడు బాలివుడ్ చూపు టాలివుడ్ సినిమాపై పడింది. ఇక్కడ ఏ సినిమాలు హిట్టయ్యాయి.. అని ఎంక్వైరీ చేస్తున్నారు. దీంతో వారి కళ్లు నానీ హీరోగా నటించిన ఈ ఏడాది సమ్మర్ డీసెంట్ హిట్ జెర్సీ సినిమాపై పడిందని సమాచారం.  

 

ఈ సినిమా రీమేక్ కోసం బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ తో సహా పలువురు జెర్సీ నిర్మాత నాగవంశీని అప్రోచ్ అయ్యారని సమాచారం. సినిమా మెయిన్ ప్లాట్ క్రికెట్ యూనివర్శల్ సబ్జెక్ట్ కావడం, సినిమాలో ఉన్న కంటెంట్, ఫ్యామిలీ ఎమోషన్స్ వారికి నచ్చిందని సమాచారం. దీంతో జెర్సీని రీమేక్ చేయాలని బాలీవుడ్ చూస్తోంది. తెలుగులో దర్శకత్వం వహించిన గౌతమ్ తిన్ననూరినే దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నాయి. అయితే.. నాగవంశీ ఇంకా ఎవరికీ తెలుగు రైట్స్ అమ్మలేదని తెలుస్తోంది.

 

కబీర్ సింగ్ తో తెలుగు సినిమాలపై బాలీవుడ్ కి నమ్మకం పెరిగింది. కథా, కథనం, దర్శకత్వం వారికి నచ్చుతున్నాయి. ఇదే కొనసాగితే జాతీయస్థాయిలో తెలుగు సినిమాకు మార్కెట్ కూడా బాగుంటుంది. ఈ సినిమా బాలీవుడ్ లో నిర్మితమైతే హీరోగా కబీర్ సింగ్ లో నటించిన షాహిద్ కపూర్ నటించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని బాలీవుడ్ – టాలీవుడ్ భోగట్టా.


మరింత సమాచారం తెలుసుకోండి: