హ్యాపీ డేస్ సినిమాతో హీరోగా పరిచయం అయిన నిఖిల్ తర్వాత నటించిన కొన్ని సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి.  ఇక ఈ యంగ్ హీరో కెరీర్ ఔట్ అనుకున్న సమయంలో స్వామిరారా, కార్తికేయ, 'ఎక్కడకి పోతావు చిన్నవాడ' వంటి సినిమాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు.  వరుస విజయాలు అందుకుంటున్న నిఖిల్ ఆ మద్య కిర్రాక్ పార్టీ అంటూ వచ్చి మళ్లీ డిజార్టర్ మూటగట్టుకున్నాడు.

స్వామిరారా మూవీ తర్వాత నిఖిల్ సరికొత్త కథలను ఎన్నుకుంటూ కెరీర్ పరంగా జోరుమీదున్నాడు. ఇక నిఖిల్ నటించిన 'అర్జున్ సురవరం'  సినిమా షూటింగ్ పూర్తై ఇంతకాలమవుతున్నా విడుదలకు నోచుకోవడంలేదు. ఏప్రిల్ లో విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదాలు పడుతూనే ఉంది. ఈ మూవీ మొదటి నుంచి ఎన్నో కాంట్రవర్సీలు సృష్టిస్తూనే ఉంది. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే ‘శ్వాస’ అనే సినిమాను మొదలుపెట్టాడు. 

సినిమా ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశాడు. ఈ సినిమాతో కిషన్ కట్టాదర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. అయితే ఈ మూవీ ఔట్ లుక్ చూసిన నిఖిల్ అసంతృప్తి వ్యక్తం చేశాడట.  సినిమా షూటింగ్ ఆపేసి చాలా రోజులైందని ఇక మొదలుకాదని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అయితే రీషూట్ చేస్తారా..? లేక కంప్లీట్ గా సినిమాను పక్కన పెట్టేస్తారా..? అనే విషయంలో ఖచ్చితమైన నిర్ణయం తీసుకోలేదని సమాచారం. 


మరింత సమాచారం తెలుసుకోండి: