అదేంటో గాని  బాలయ్యబాబు, వెంకటేష్ లాంటి ముదురు హీరోలకు కూడా హీరోయిన్లు దొరుకుతున్నారు గాని   అఖిల్ బాబుకు మాత్రం హీరోయిన్ దొరకట్లేదు.  దాదాపు ఏడు నెలలు నుండి  అఖిల్ బాబు హీరోయిన్లును చూస్తూనే ఉన్నాడు. కానీ ఇంకా హీరోయిన్ మాత్రం ఫైనల్ కాలేదు. ఇంతకీ ఏ సినిమాలో అనుకుంటున్నారా బొమ్మరిల్లు భాస్కర్ తో  అఖిల్ చేయబోతున్న  సినిమాలోనే.  ఈ సినిమాకు సంబంధించి   ఇప్పటికే కాస్టింగ్ మొత్తం పూర్తయింది. ఒక్క హీరోయిన్ తప్ప.  


పైగా రేపటి నుండి  మొదటి షెడ్యూలు కూడా మొదలు కానుంది.  అయితే ఇంకా ఈ సినిమాలో  హీరోయిన్ మాత్రం ఫైనల్ కాలేదు. ఆ మధ్య  కియరా అద్వానీ లేదా రష్మికా  మండన్నలో ఎవరో ఒకర్ని  హీరోయిన్ గా తీసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ వాటిల్లో నిజం లేదని తేలిపోయింది.  ఇక అఖిల్ సరసన దాదాపు కొత్త హీరోయిన్ నే  ఫైనల్ చేసేలా ఉన్నారు. మొదట కొంతమంది స్టార్  హీరోయిన్ల పేర్లను పరిశీలించినా  చివరికీ కొత్త అమ్మాయి వైపే మొగ్గు చూపారట దర్శక నిర్మాతలు. కాకపోతే ఆ కొత్త హీరోయిన్ అఖిల్ బాబుకు నచ్చాలి. కానీ నచ్చకపాయే.      


 ఇక అఖిల్ కి  'మిస్టర్ మజ్ను' కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది.  దాంతో తన తరువాత సినిమా పై మరింత జాగ్రత్త  పడుతున్నాడు.  ఈ సినిమా కూడా భాస్కర్ బొమ్మరిల్లు సినిమాలో లాగానే  బలమైన  ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు  లవ్ స్టోరీ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోందట. 



మరింత సమాచారం తెలుసుకోండి: