మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా సైరా కు గుమ్మడికాయ కొట్టేసారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్, కీలకమైన గ్రాఫిక్స్ వర్క్ వుంది. ఇక దాని మీద మెగాస్టార్ ఎక్కువగా దృష్టి పెట్టాల్సిన పని లేదు షూటింగ్ వరకు చిరు పార్ట్ మొత్తం కంప్లీటయిందన్న సంగతి తెలిసిందే. విడుదలకు డేట్ కూడా బయటకు వచ్చింది. అందువల్ల తన 152వ సినిమా మీద దృష్టిపెట్టారు మెగాస్టార్. టాప్ డైరక్టర్ కొరటాల శివ ఈ సినిమాకు దర్శకుడు అన్న సంగతి తెలిసిందే.
ఆగస్టు నెలాఖరున లేదా, సెప్టెంబర్ నుంచి చిరు-కొరటాల శివ సినిమా స్టార్ట్ అవుతుందని లేటెస్ట్ అప్డేట్. గతంలో రంగస్థలం సినిమా కోసం విలేజ్ సెట్ వేసిన ప్రదేశం పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో రెండు మూడు ఇళ్ల భారీ సెట్ నిర్మాణం ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. సమ్మర్‌కు విడుదల టార్గెట్ గా ఈ సినిమా రెడీ చేస్తారని టాక్.
ఇప్పటికే కొరటాల ఫుల్ బౌండ్ స్కిప్ట్ తో డైలాగ్ వెర్షన్ తో రెడీగా వున్నారు. స్టార్ కాస్ట్ కూడా బయటకు వెల్లడించడం లేదు కానీ దాదాపు అంతా ఫిక్సయినట్లు సమాచారం. చిరు వయసుకు, స్థాయికి సరిపడా, మెసేజ్ ఓరియెంటెడ్ కథను కొరటాల రెడీ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు శివ ఒక్క ఫ్లాప్ ని కూడా చూడలేదు. అన్ని వరుస హిట్లతో ఎంతో కాన్ఫిడెంట్‌గా ఉన్న శివ మెగాస్టార్ ను ఎలా చూపించబోతున్నారో అన్న కుతూహలం అందరిలోనూ ఉంది.