త్వరలో స్టార్ మా ఛానల్ లో ప్రసారం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 3 పై వీక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. ఇక ఇటీవల ప్రదర్శితమైన రెండు సీజన్లు మంచి విజయవంతం అవడంతో మూడవ సీజన్ ఎప్పుడు మొదలవుతుందో, ఎలా ఉంటుందో అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. ఇకపోతే ఈ సీజన్ కు యువసామ్రాట్ నాగార్జున హోస్ట్ గా రాబోతున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. 

ఇక ఈ షోలో పార్టిసిపేట్ చేసే కంటెస్టెంట్స్ వీరే అంటూ కొద్దిరోజులుగా కొందరి పేర్లు మీడియా వేదికల్లో ప్రచారం అవుతుండగా, వారిలో వర్ధమాన నటి శోభిత ధూళిపాళ్ల కూడా ఉందంటూ పలు వార్తలు పుకారయ్యాయి. ఇక ఈ విషయాన్ని ఆమె వద్ద కొందరు సన్నిహితులు ప్రస్తావించడంతో ఈ భామకు కోపం వచ్చిందట. నిజానికి తాను బిగ్ బాస్ షో చాలా సార్లు చూడడం జరిగిందని, అయితే ఎప్పుడూ ఆ షోలో నటించాలని అనుకోలేదని, అంతేకాక ఇప్పటివరకు తమ షోలో నటించమని బిగ్ బాస్ టీమ్ ఎవరూ కూడా తనను అప్రోచ్ అవలేదని అంటోందట. 

నిజానికి కేవలం శోభిత పేరు మాత్రమే కాక, మరికొందరు నటీనటులు మరియు మరొక ఇద్దరు తెలుగు యాంకర్ల పేర్లు కూడా ప్రచారం అవుతుండడంతో అసలు వారిలో ఎవరు షోలో పార్టిసిపేట్ చేస్తున్నారో ఎవ్వరికీ అర్ధం కాని పరిస్థితి. అయితే బిగ్ బాస్ రూల్స్ ప్రకారం ఆ షో ప్రారంభ రోజునకాని మనకు అందులో కంటెస్టెంట్స్ గా ఎవరు పార్టిసిపేట్ చేస్తున్నారు అనేది తెలియదు. సో, ప్రస్తుతం ప్రచారంలో ఉన్న హోస్ట్, మరియు పార్టిసిపెంట్స్ పేర్లపై బిగ్ బాస్ టీమ్ క్లారిటీ ఇస్తేనే గాని ఎవరెవరు ఉన్నారు అనేది చెప్పలేం....!!   


మరింత సమాచారం తెలుసుకోండి: