విజయ్ దేవరకొండ-రష్మిక మందన్నల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఎలా ఉంటుందో తెలిసిందే. గీత గోవిందం సినిమాలో వీరి కాంబినేషన్ కి ప్రేక్షకులు క్లీన్ బౌల్డ్ అయ్యారు. అయితే అదేమిటో కానీ అప్పటి నుంచి వీరిద్దరి మధ్య అఫ్ స్క్రీన్ కెమిస్ట్రీ కూడా ఉందని, వారిద్దరి ప్రేమ వలన రక్షిత్ తో రష్మిక నిశ్చితార్ధం కూడా రద్దయిందని పుకార్లు వచ్చాయి.


అయితే మరోసారి వీరి ఫ్రెండ్ షిప్ మరోసారి హాట్ టాపిక్ గా మారింది. తాజాగా విజయ్ దేవరకొండ,. తరుణ్ భాస్కర్ తదితరులు ఏఎంబి సినిమాస్ లో ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమా చూడటం తర్వాత ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయితే ఈ సినిమాకి రష్మిక కూడా వచ్చిందని, ప్రెస్ మీట్ లో లేదని తెలిసింది.


ఈ ప్రెస్ మీట్ తర్వాత విజయ్ ఫ్రెండ్స్ గ్యాంగ్ తో కలసి జూబ్లీ హిల్ లోని ఓ హోటల్ వెళ్లి అక్కడ ఫుల్ గా చిల్ అవుట్ అయ్యారట. ఈ సందర్భంగా తీసిన ఫోటో ఇప్పుడు నెట్లో హల్ చల్ చేస్తుంది. ఇందులో రష్మిక కళ్ళజోడు పెట్టుకొని ఉండటం విశేషం. సినిమా ఫంక్షన్లు.. ఇతర ఈవెంట్లకు రష్మిక కాంటాక్ట్ లెన్సులు పెట్టుకొని వస్తుంది. 


కానీ ఫ్రెండ్స్ తో క్యాజువల్ గా ఉన్నప్పుడు కళ్ళజోడు ధరిస్తుంది. విజయ్ - రష్మిక ఫ్రెండ్షిప్ చూసినవారు ఇది జస్ట్ ఫ్రెండ్ షిప్ అయి ఉండకపోవచ్చని.. ఫ్రెండ్ షిప్ కంటే రెండాకులు ఎక్కువే ఉందని అంటున్నారట.  మరి ఇవి జస్ట్ ఊహాగానాలేనా లేదా అనేది తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.  



మరింత సమాచారం తెలుసుకోండి: