కేసీఆర్ సర్కార్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అక్రమ కట్టడాలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇందుమూలంగా గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్న అక్రమ భవనాలను తొలగించే కార్యక్రమం అధికారంలోకి వచ్చిన వెంటనే చేపట్టింది. ఇందులో భాగంగా గతంలో ప్రభాస్ కి సంబంధించిన భవనంపై చర్యలు తీసుకున్న కేసీఆర్ సర్కార్ తాజాగా డైరెక్టర్ వివి వినాయక్ కి సంబంధించిన అక్రమ భవనాలపై అధికారులు సీరియస్ అయినట్లు సమాచారం.


ఇక విషయంలోకి వెళితే వట్టినాగులపల్లిలో వివి.వినాయక్ అనుమతి లేకుండా ఆరు అంతస్థుల భవనం నిర్మించినట్లు తెలియగానే విచారించిన అధికారులు ట్రిపుల్ వన్ జీవోకు  వ్యతిరేకంగా ఉన్నట్లు కనుగొన్నారు. గండిపేట పరిధిలో ఉన్న వట్టినాగుల పల్లి కొత్త జిల్లాలు ఏర్పడకముందు గ్రామ పంచాయితీలో ఉండేది. జిల్లాల ఏర్పాటు అనంతరం జీహెచ్ఎంసీ ఆధీనంలోకి వచ్చింది.


అయితే వట్టినాగులపల్లిలో ఉన్నప్పుడు జీ+2 భవన నిర్మాణానికి అనుమతి తీసుకున్న వినాయక్ జీవోను లెక్క చేయకుండా జి+6 భవనాన్నీ నిర్మించసాగారు. జీహెచ్ఎంసీ ఇదివరకే ఈ నిర్మాణాలపై సీరియస్ అయ్యింది. టౌన్ ప్లానింగ్ విభాగం మూడు సార్లు నోటీసులు ఇచ్చింది. అయినా కానీ డైరెక్టర్ వి.వి.వినాయక్ స్పందించకపోవడంతో రూల్స్ కి వ్యతిరేకంగా నిర్మాణంలో ఉన్న ఫ్లోర్లను కూల్చేశారు. మరి ఈ విషయంలో డైరెక్టర్ వి.వి.వినాయక్ ఇంకా స్పందించలేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: