ప్రభాస్ టాలీవుడ్ మోస్త్ బ్యాచలర్, ఆరడుగుల అందగాడు. బాహుబలి. ఈ అందగాణ్ణి చేసుకోవాలని ప్రతి అమ్మాయి ఆశ పడుతుంది. ప్రభాస్  అందం అలాంటిది. హీరోగా సూపర్ హిట్స్ కొడుతున్నా కూడా పెళ్ళి జోకికి పోని ప్రభాస్ ఎపుడు చేసుకుంటాడో కానీ అమ్మాయిలు మాత్రం విదేశాల నుంచి వచ్చేస్తున్నారు.


ఈ మధ్య ప్రభాస్ ని చూసేందుకు 15 మంది జపాన్ అమ్మాయిలు వచ్చారట. వారు ప్రభాస్ పెళ్ళి గురించి అడిగారట. అనుష్కతో పెళ్ళి గాసిప్స్ పై కూడా డైరెక్ట్ గానే అడిగేశారట. దానికి మన ప్రభాస్ నవ్వే సమాధానంగా  చెప్పారట.


ఇదిలా ఉండగా అసలు ప్రభాస్ ఎందుకు పెళ్ళి చేసుకోవడంలేదు. మరో వైపు అనుష్క కూడా అలాగే ఉండిపోయింది. ఈ ఇద్దరూ అలాగే ఉండిపోవడం వెనక కధేంటి. ఈ గాసిప్స్ ఎన్నాళ్ళు. టాలీవుడ్లో అందమైన ఈ జంట ఇలాగే ఉండిపోతారా. దీనికి కూడా అందంగా ప్రభాస్ నవ్వేస్తాడు అంతే మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: