ప్రముఖ నటి, దర్శకురాలు విజయనిర్మల కన్ను మూసారు. హైదరాబాద్ గచ్చిబౌలి లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. విజయ నిర్మల1946 ఫిబ్రవరి 20 న జన్మించారు. 

 

విజయ నిర్మల తండ్రి స్వస్థలం మద్రాసు, తల్లి స్వస్థలం గుంటూరు జిల్లా నరసరావుపేట.మొత్తం 44 చిత్రాలకు దర్శకత్వం వహించారు విజయనిర్మల. అత్యధిక చిత్రాలు దర్శకత్వం వహించిన మహిళగా గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించారు విజయ నిర్మల.

 

విజయ నిర్మల దర్శకత్వం వహించిన చిత్రాలు: మీనా, కవిత, దేవదాసు, దేవుడు గెలిచాడు,రౌడీ రంగమ్మ, మూడు పువ్వులు ఆరు కాయలు, కిలాడీ కృష్ణుడు, బోగిమంటలు, పుట్టింటి గౌరవం, నేరము శిక్ష.

 

విజయ నిర్మల నటించిన తెలుగు చిత్రాలు: పూల రంగడు, సాక్షి, అసాధ్యుడు, బంగారు గాజులు, బొమ్మా బొరుసు, మోసగాళ్లకు మోసగాడు, పండంటి కాపురం, పాడిపంటలు, అల్లూరి సీతారామరాజు, తాతామనవడు, మీనా, మారిన మనిషి, కురుక్షేత్రం, పిన్ని.

 

విజయ నిర్మల సినీ రంగానికి అందించిన సేవలకు ఆమెను రఘుపతి వెంకయ్య అవార్డు వరించింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: